బిల్లులు లేని దీపావళి సామాగ్రి పట్టివేత
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంబాలాంతరం వంతెన సమీపంలోని చెక్‌పోస్టు వద్ద బిల్లులు, రసీదులు లేకుండా తరలిస్తున్న దీపావళి మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పామర్రు ఎస్సై జి.సోమేంద్ర ఆధ్వర్యంలో సిబ్బంది వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ వ్యవహారం వెలుగుచూసింది.లక్షలాది రూపాయల విలువైన సామగ్రిని సరైన బిల్లులు లేకుండా తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.మందుగుండు సామగ్రితో పాటు రవాణాకు వినియోగించిన వాహనాలను సీజ్ చేశారు.ఈ సరుకు ఎవరిది? ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు? వాహనాలు ఎవరికి చెందినవి? అనే అంశాలపై విచారణ చేపట్టారు.సమగ్ర విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్సై సోమేంద్ర తెలిపారు.