జలదంకిలో జోరుగా వైసీపీ ఎన్నికల ప్రచారం
జలదంకి మేజర్ న్యూస్ : ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి, యువ నాయకులు మేకపాటి అభినవ్ రెడ్డి ఆశీస్సులతో జలదంకి మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బలపరిచిన బిట్–2 MPTC అభ్యర్థి సూరే వెంకట పద్మావతి, బిట్–1 MPTC అభ్యర్థి తిప్పారెడ్డి ఇందిరమ్మ లకు మద్దతుగా జలదంకిలో ఎన్నికల ప్రచారం సోమవారం జోరుగా సాగింది.
వైసీపీ మండల కన్వీనర్ ఇస్క మదన్ మోహన్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా అభ్యర్థులు, పార్టీ నాయకులు ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని కోరారు. రానున్న ఎన్నికల్లో బిట్–2 MPTC అభ్యర్థి సూరే వెంకట పద్మావతి, బిట్–1 MPTC అభ్యర్థి తిప్పారెడ్డి ఇందిరమ్మ లకు కేటాయించిన ఫ్యాన్ గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.
ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.