BREAKING
ఓటీటీలోకి జి.వి. ప్రకాశ్ కుమార్ కొత్త థ్రిల్లర్.. అక్టోబర్ 30 నుంచి సోనీ లివ్‌లో 'ఇమ్మోర్టల్' స్ట్రీమింగ్ జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు క్రీడా పోటీలు. : ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం* *బోరంచ లో రూ.95 లక్షలతో పునరుద్ధరించిన 3.95 ఎంఎల్‌డీ నీటి శుద్ధి కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే* అర్నాబ్ తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలివర్షాలు తగ్గేవరకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలి తుఫాన్ హెచ్చరికతో అధికారులు అప్రమత్తం జలదంకిలో జోరుగా వైసీపీ ఎన్నికల ప్రచారం బిల్లులు లేని దీపావళి సామాగ్రి పట్టివేత ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు శివారులో రోడ్డు ప్రమాదం ట్రాక్టర్ యజమానికి తీవ్ర గాయాలు విజయ్ దేవరకొండ, రష్మికపై దుష్ప్రచారం.. సైబర్ క్రైమ్‌ను ఆశ్రయించిన విరోష్ టీమ్ *ఆదికవి మహర్షి వాల్మీకి సేవలు చిరస్మరణీయం.. ఆయన ఆశయాలు సమాజానికి ఆదర్శం* వాయుగుండం ముప్పు.. అప్రమత్తతే ప్రజలకు రక్షణ! తుపాను హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరితణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ భూపాలపల్లి లో కాంగ్రెస్ ఓటు బచావో- దేశ్ బచావో కార్యక్రమం *ఓటు హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ కార్యాచరణ* దీపావళి తాత్కాలిక బాణసంచా దుకాణాలకు లైసెన్సులు తప్పనిసరి

ఓటర్ల జాబితా సిద్ధం - పరిశీలన కొరకు ప్రదర్శన కమిషనర్ ఏసుబాబు

Select Suryaa Now
ఓటర్ల జాబితా సిద్ధం - పరిశీలన కొరకు ప్రదర్శన  కమిషనర్ ఏసుబాబు

తాడేపల్లిగూడెం, మేజర్ న్యూస్; తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో డీ-లిమిటేషన్ లో భాగంగా 35 వార్డుల నుండి 48 వార్డులుగా విభజించిన విషయం తెలిసిందే. ఈరోజు 48 వార్డులకు సంబంధించిన ఓటర్ల జాబితాను పరిశీలన కొరకు పురపాలక కార్యాలయంలో ప్రదర్శన చేయడం జరిగింది. అదే విధంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలైన సబ్ రిజిస్టర్ ఆఫీస్, కోర్టు, ఆర్డీవో ఆఫీస్, ఎంఆర్వో ఆఫీస్ మరియు ఇతర ప్రభుత్వ కార్యాలయాలలో కూడా ఓటర్ల జాబితాను ఉంచడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఎం. యేసుబాబు మాట్లాడుతూ, 48 వార్డులకు గాను మొత్తం 1,00,728 మంది ఓటర్ల జాబితా సిద్ధం చేసి ప్రచురణ చేసామని తెలిపారు. ప్రతి ఓటరు తన పేరు, వార్డు నెంబర్, పోలింగ్ స్టేషన్ వివరాలను పరిశీలించుకోవాలని, 48 వార్డు లకు సంబంధించిన మ్యాప్ ను కూడా అందుబాటులో ఉంచామని తెలియచేశారు. ఓటర్లు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కమిషనర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ డి భవాని బాబు, మున్సిపల్ మేనేజర్ పి ప్రసాద్ రావు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ జి సీతారాం, స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు మేనేజర్ నాగరాజు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.