BREAKING
శివానంద్ ను పరామర్శించిన మాధవ రెడ్డి! జాతీయ స్థాయి గణిత ఒలింపియాడ్‌లో శ్రీ చైతన్య విద్యార్థుల ప్రతిభ.. 18 మంది విద్యార్థులకు ప్రాంతీయ గణిత ఒలింపియాడ్‌కు అర్హత జోరు పెంచిన రాజారెడ్డి ప్రచారం.. -58వ డివిజన్లో ప్రజలు అడుగడుగున నిరాజనం 7వ వార్డులో '' ఇంటింటికి ..... టీడీపీ''...! డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా -రాయల్ వారి వీధి ప్రచారంలో బోయళ్ళ శాంతి అర్హులైన పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ బ్రాహ్మణపల్లి, కామేపల్లి గ్రామాల్లో గడపగడప ప్రచారంలో జడ్పీటీసీ సభ్యురాలు డాక్టర్ వునం దీపిక పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ గురజాల మండలంలోని బ్రాహ్మణపల్లి, కామేపల్లి గ్రామాల్లో* జరిగిన గడపగడప ప్రచార కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు డాక్టర్ వునం దీపికపాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి తిరుగుత చీరాల బీచ్‌లు తాత్కాలికంగా మూసివేత అవినీతి రహిత సింగరేణి మన లక్ష్యం.. ఎస్వో టు జిఎం డి.వి రామారావు అలయాస్ రుక్మిణి చిత్రం నుంచి రుక్కు రుక్కు రుక్మిణి సాంగ్ ప్రోమో విడుదల.. ఆకట్టుకుంటున్న నితిన్ మాస్ బీట్స్ బుచ్చి10,14 వార్డుల్లో చెప్పాం- చేస్తున్నాం కార్యక్రమం లో ఎమ్మెల్యే 69వ డివిజన్లో SDPI దూకుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల ఉచిత నమోదు కార్యక్రమం పట్టణ మరియు స్థానిక స్వపరిపాలన సంస్థల ఎన్నికలు-2026 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం

ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం* *బోరంచ లో రూ.95 లక్షలతో పునరుద్ధరించిన 3.95 ఎంఎల్‌డీ నీటి శుద్ధి కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే*

Select Suryaa Now
ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం* *బోరంచ లో రూ.95 లక్షలతో పునరుద్ధరించిన 3.95 ఎంఎల్‌డీ నీటి శుద్ధి కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే*

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామంలో పంప్‌హౌస్ వద్ద మిషన్ భగీరథ విభాగానికి చెందిన 3.95 ఎంఎల్‌డీ సామర్థ్యం గల ఎన్‌ఏపీ నీటి శుద్ధి కేంద్రం (డబ్ల్యూటీపి) పునరుద్ధరణ పనులు డీఎంఎఫ్‌టీ నిధులు రూ.95 లక్షలతో పూర్తికావడంతో, సోమవారం నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ప్రారంభించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి మాట్లాడుతూ. ఎల్‌నినో ప్రభావంతో నీటి లభ్యతపై ఆందోళనలు ఉన్న నేపథ్యంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ నీటి శుద్ధి కేంద్రం ద్వారా నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంతో పాటు నియోజకవర్గంలోని పలు మండలాలకు, ముఖ్యంగా మానూర్ మండల ప్రజలకు తాగునీటి సరఫరాకు అదనపు భరోసా లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కేంద్రం అందుబాటులో ఉండటం వల్ల రానున్న నెలల్లో నీటి సమస్యను ఎదుర్కోవడంలో ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చామని చెప్పినప్పటికీ, క్షేత్రస్థాయిలో ప్రజలకు నీటి సరఫరా ఏ మేరకు అందిందో పరిశీలించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన బోర్లు ఇప్పటికీ అనేక గ్రామాల్లో ప్రజలకు తాగునీటిని అందిస్తున్నాయని తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. అందులో భాగంగా స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేస్తున్నామని తెలిపారు. అలాగే బోరంచ గ్రామ అభివృద్ధికి సంబంధించి పలు కీలక విషయాలను వెల్లడించారు. బిరాంచ నల్లపోచమ్మ ఆలయం వద్ద నదీ తీరంలో రూ.2 కోట్లతో బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీనివల్ల ఈ ప్రాంతానికి వచ్చే భక్తులు, సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. బోరంచ గ్రామ ప్రజల వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) మంజూరు చేయించుకున్నామని, త్వరలోనే తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తో కలిసి ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. విద్యుత్ సరఫరా విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా విద్యుత్ సమస్యలు తలెత్తితే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజలకు తాగునీరు, విద్యుత్ వంటి అత్యవసర సదుపాయాల్లో ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు భోజి రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ యువ నాయకులు లోకేష్ రెడ్డి గ్రామ సర్పంచ్ బీరప్ప కురుమ, ఉప సర్పంచ్ కరీం, దిగంబర్ రెడ్డి, బ్రాహ్మణాoద్ రెడ్డి మాజీ సర్పంచ్లు, సంజీవ్ సర్పంచ్, నవీన్ రెడ్డి, మల్లప్ప ఛైర్మెన్, నరసింహ రెడ్డి జనర్షింలు, శ్రీకాంత్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సంబంధిత శాఖల అధికారులు, గ్రామస్తులు, స్మార్ట్ రేషన్ కార్డుల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.