BREAKING
జోరు పెంచిన రాజారెడ్డి ప్రచారం.. -58వ డివిజన్లో ప్రజలు అడుగడుగున నిరాజనం 7వ వార్డులో '' ఇంటింటికి ..... టీడీపీ''...! డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా -రాయల్ వారి వీధి ప్రచారంలో బోయళ్ళ శాంతి అర్హులైన పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ బ్రాహ్మణపల్లి, కామేపల్లి గ్రామాల్లో గడపగడప ప్రచారంలో జడ్పీటీసీ సభ్యురాలు డాక్టర్ వునం దీపిక పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ గురజాల మండలంలోని బ్రాహ్మణపల్లి, కామేపల్లి గ్రామాల్లో* జరిగిన గడపగడప ప్రచార కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు డాక్టర్ వునం దీపికపాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి తిరుగుత చీరాల బీచ్‌లు తాత్కాలికంగా మూసివేత అవినీతి రహిత సింగరేణి మన లక్ష్యం.. ఎస్వో టు జిఎం డి.వి రామారావు అలయాస్ రుక్మిణి చిత్రం నుంచి రుక్కు రుక్కు రుక్మిణి సాంగ్ ప్రోమో విడుదల.. ఆకట్టుకుంటున్న నితిన్ మాస్ బీట్స్ బుచ్చి10,14 వార్డుల్లో చెప్పాం- చేస్తున్నాం కార్యక్రమం లో ఎమ్మెల్యే 69వ డివిజన్లో SDPI దూకుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల ఉచిత నమోదు కార్యక్రమం పట్టణ మరియు స్థానిక స్వపరిపాలన సంస్థల ఎన్నికలు-2026 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సమక్షంలో వైకాపా నుండి తెదేపాల చేరిక ఘట్టమనేని వారసుడి తదుపరి చిత్రం.. సంచలన విజయాల దర్శకుడితో జయకృష్ణ కొత్త సినిమా

అర్నాబ్ తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలివర్షాలు తగ్గేవరకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలి

Select Suryaa Now
అర్నాబ్ తుఫాను పట్ల  అప్రమత్తంగా ఉండాలివర్షాలు తగ్గేవరకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలి

 ఏలూరు, సూర్య న్యూస్:  జిల్లాలో తీవ్ర తుఫాన్ ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉన్నందున తుఫాన్ ముంపు తొలగే వరకు అధికార యంత్రాంగం అప్రమత్తం ఉండాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. స్థానిక కలెక్టరేట్ లో సోమవారం తుఫాన్ తీవ్రత, నష్ట నివారణాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ అర్నాబ్ తుఫాన్ కారణంగా జిల్లాలో ఈనెల 27వ తేదీ సాయంత్రం నుండి భారీ వర్షాలు, 125 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరించిందని, తుఫాన్ కారణంగా జిల్లాలో ఎటువంటి ప్రాణ, ఆస్థి నష్టాలు కలగకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలన్నారు.  పెనుగాలులు వీచే అవకాశం ఉన్న దృష్ట్యా శిధిల భవనాలు, కట్టడాలు, రేకుల షెడ్లు కూలే అవకాశం ఉన్నదని సదరు యజమానులను అప్రమత్తం చేయాలన్నారు.    భారీ వర్షాల సమయంలో కల్వర్టులు, కాజ్ వే లను ప్రజలను దాటకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేయడంతోపాటు, సిబ్బందిని నియమించాలని, బారికేడ్లు ఏర్పాటుచేయాలన్నారు.  విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా చూడాలన్నారు. చెట్లు కూలిన కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టేలా సిబ్బందిని, పరికరాలను మండల స్థాయిలో సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. విద్యుత్ సమస్యలపై ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు టోల్ ఫ్రీ ఫోన్ నంబర్లతో  కంట్రోల్ రూమ్ లు ఏర్పాటుచేయాలన్నారు. రహదారి రవాణాకు  ఎటువంటి ఆటంకాలు లేకుండా  కూలిన చెట్లు తొలగించేందుకు క్రేన్లు, బుల్డోజర్లు వంటివి సిద్ధం చేసుకోవాలని ఆర్అండ్ బి అధికారులను కలెక్టర్ ఆదేశించారు.   తుఫాన్ తీవ్రత దృష్ట్యా జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ఈనెల 27, 28 తేదీలలో సెలవు ప్రకటించడం జరిగిందన్నారు.  తుఫాన్ కారణంగా పంటలు నష్టపోకుండా తీసుకోవలసిన చర్యలపై రైతులకు అవగాహన కలిగించాలన్నారు.  అధికార యంత్రాంగం ఈనెల 29వ తేదీ వరకు వారి ప్రధాన కేంద్రాలలో ప్రజలకు అందుబాటులో  అప్రమత్తంగా ఉండాలని, తుఫాన్ తీవ్రతపై ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.  ఎక్కడా ఎటువంటి సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. ఏలూరు కలెక్టరేట్ లో  18002331077, 08812-224519 , 9491041419 ఫోన్ నంబర్లతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.  భారీ వర్షాల సమయంలో అత్యవసర పరిస్థితిలో తప్ప   బయటకు రావద్దు ప్రజలకు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. గర్భిణీలు, బాలింతలు, వృద్దులు, దివ్యాంగులు లను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. లోతట్టు ప్రాంతాలలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ, అసిస్టెంట్ కలెక్టర్ సిహెచ్. శ్రావణ్ కుమార్ రెడ్డి, జిల్లాపరిషత్ సీఈఓ ఎం. కృష్ణమోహన్, డిపిఓ మల్లికార్జునరావు, సెట్ వెల్ సీఈఓ ప్రభాకర్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, ట్రాన్స్కో  ఎస్ఈలు జెడ్. రమేష్, విజయరత్నం, అంబేద్కర్ , స్కిల్ డెవలప్మెంట్ అధికారి జితేంద్రబాబు,, డీఈఓ వెంకటలక్ష్మమ్మ, గృహనిర్మాణ శాఖ అధికారి సత్యనారాయణ, ఎస్డీసీ దేవకీదేవి, డిఆర్డ్ఏ  పీడీ విజయలక్ష్మి, విభిన్నప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏడి రామ్ కుమార్, మెప్మా పీడీ రాజబాబు, ప్రభృతులు పాల్గొన్నారు.

 పసుమర్తి రాము జిల్లా ఇంచార్జ్ ఏలూరు,