రజాక్ పల్లి లో 700 ఈత మొక్కల నాటిన ఎక్సైజ్ అధికారులు…
రామాయంపేట;నిజాంపేట మండల పరిధిలోని రజాక్ పల్లి గ్రామంలో సోమవారం గౌడ కులస్తుల ఆధ్వర్యంలో ఈత మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామయంపేట ఎక్సైజ్ సీఐ నరేందర్ రెడ్డి, ఎక్సైజ్ ఎస్ఐ విక్రమ్, హాజరై ఈతమొక్కలు నాటారు. ఈ సందర్భంగా గౌడ కులస్తులు మాట్లాడుతూ కల్వకుంట రజాక్ పల్లి సొసైటీ ఆధ్వర్యంలో 700 ఈత చెట్ల మొక్కలు నాటడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గౌడ సంఘం అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ఈత చెట్లను అందించడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి గౌడ సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రజలకు స్వచ్ఛమైన ఈత కల్లు ను అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ కులస్తులు మాజీ సర్పంచ్ పెద్ద నారా గౌడ్, చిన్న నారా గౌడ్, శ్రీనివాస్ గౌడ్,భాస్కర్ గౌడ్, నారా గౌడ్, స్వామి గౌడ్,బాలరాజ్ గౌడ్, మనోహర్ గౌడ్, ప్రశాంత్ గౌడ్, రామస్వామి గౌడ్, తదితరులు పాల్గొన్నారు