జంగారెడ్డిగూడెం మున్సిపల్ వైస్ చైర్మన్ ఆర్యవైశ్యులకు దక్కేనా ?
జంగారెడ్డిగూడెం,మేజర్ న్యూస్: జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ లో వైస్ చైర్మన్ పదవి కోసం ఆర్యవైశ్యులు ఉవ్విళ్లూరుతున్నారు. చైర్ పర్సన్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో సుమారు 8 వేలకు పైగా ఓటర్లున్న వైశ్యులు తమకు వైస్ చైర్మన్ పదవి ఇవ్వాలనే డిమాండ్ తో ఉన్నారు. కూటమి 16వ వార్డులో కొల్లేపర ఆనందరావు,22లో గుళ్లపూడి శ్రీ దేవి,23లో కర్పూరం లక్ష్మీప్రస న్న కౌన్సిలర్ పదవి కోసం పోటీలో ఉన్నారు. వీరిలో ఆనందరావు జనసేన నుండి, శ్రీదేవి,లక్ష్మీ ప్రసన్న టిడిపి నుండి రంగంలో ఉన్నారు. వైసిపి నుండి 16వ వార్డులో చిన్ని సౌందర్య, 17 లో కర్పూరం ప్రవల్లిక,23లో చొప్పర్ల శ్రీదేవి,28లో అత్తెo మానసకుమారి పోటీ చేస్తున్నారు.వీరు నలుగురు మహిళలే కావడం విశేషం. ఇది ఇలా ఉండగా 16వ వార్డులో కొల్లేపర ఆనందరావు,చిన్ని సౌందర్య,23లో కర్పూరం లక్ష్మీ ప్రసన్న,చోప్పర్ల శ్రీదేవి ముఖా ముఖి పోటీలో ఉన్నారు జంగారెడ్డి గూడెం మేజర్ పంచాయతీగా ఉన్నప్పుడు చీమకుర్తి ఆదిలక్ష్మి, మండవల్లి విజయ సారథి (సోంబాబు) సర్పంచ్ పదవిని అలంకరించారు. అనంతరం మేజర్ పంచాయతీ నుండి నగర పంచాయతీగా అప్ గ్రేడ్ అయినా ఆ పాలకవర్గంలో వైశ్యుల కులంకి చెందిన పసుమర్తి రమాదేవి, మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ అయినప్పుడు ఆ పాలకవర్గంలో ముగ్గురు వైశ్యులు కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు.వారిలో కంచర్ల వాసవి రత్నం,వైస్ చైర్ పర్సన్ గా కంచర్ల గీతా కుమారి, తడికమళ్ల బిఏ మురళి కౌన్సిలర్లు అయ్యారు. గత పాలకవర్గంలో ముగ్గురు వైశ్యులు కౌన్సిలర్లు అవ్వటమే కాకుండా వైస్ చైర్మన్ పదవిని కూడా ప్రధానంగా పొందగలిగారు.ఇది ఇలా ఉండగా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ ఎన్నికలకు ముందు బహిరంగంగా రాష్ట్ర వైసీపీ సీనియర్ నాయకులు జె ట్టి గురునాధరావు,చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జ్ కంభం విజయ రాజు సమక్షంలో ఈ ఎన్నికల్లో వైసిపి ఘన విజయం సాధిస్తే వైస్ చైర్మన్ పదవి ఆర్యవైశ్యులకు ఇస్తామని ప్రకటించి,వారిని ఆహ్వానించారు. జంగారెడ్డిగూడెం పట్టణం సర్వతో ముఖఅభివృద్ధికి ఆర్యవైశ్యుల పాత్ర ఎంతో ఉంటుందని తెలిపారు. పట్టణంలో వైశ్యుల జనాభా ఓటర్ల సంఖ్య బట్టి వైశ్య ఓటర్లు కీలకంగా మారుతున్నారు. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో వైశ్యుల్లో ఎవరు విజయం సాధిస్తారో ? ఎవరికి వైస్ చైర్మన్ పదవి లభించేనో ? ఓటర్లే నిర్ణయించనున్నారు.ఆ అదృష్టం ఎవరిని వరించనున్నారో?
రిపోర్టర్ కెవి రమణ రావు జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా,