వైభవంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు
వైభవంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు
ఓర్వకల్లు మేజర్ న్యూస్:
ఓర్వకల్లు మండలంలోని కేతవరం, నన్నూరు, ఉయ్యాలవాడ, పూడిచెర్ల, హుస్సేనాపురం, లొద్దిపల్లె తదితర గ్రామాల్లో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
రామాయణ మహాకావ్యాన్ని రచించిన వాల్మీకి మహర్షి జీవిత విశేషాలను స్మరించుకుంటూ, ఆయన చాటిచెప్పిన ధర్మం, సత్యం, న్యాయం, మానవతా విలువలను కొనియాడారు. ఆయన ఆశయాలు, బోధనలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
కేతవరం గ్రామంలో సాయంత్రం వాల్మీకి మహర్షి చిత్రపటంతో ఊరేగింపు నిర్వహించారు. పలు గ్రామాల్లో అన్నదాన కార్యక్రమాలు చేపట్టి గ్రామస్థులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమాల్లో గోవర్ధన్, బాలమదిలేటి, విజయుడు, రాజన్న, వెంకటేశ్వర స్వామి, వెంకటేశ్వర్లు, సుబ్బరాయుడు, గోకారి, వెంకటేష్, ఆంజనేయులు, రాముడుతో పాటు ఆయా గ్రామాలకు చెందిన వాల్మీకి సంఘాల సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.