BREAKING
ప్రతి మహిళా సంఘ సభ్యురాలి ఇంటి వద్ద ఇంకుడు గుంత నిర్మించుకోవాలి నీటి బకెట్‌లో తల మునిగి మహిళ మృతి క్యూబా పార్లమెంటరీ ప్రతినిధి బృందంతో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి భేటీ యువతకు ఎంఎస్ ధోనీ కీలక సందేశం.. ముప్పై ఏళ్లు వచ్చాక బాధపడొద్దంటే ఇప్పుడే ఆరోగ్యంపై దృష్టి పెట్టాలన్న మిస్టర్ కూల్ *సంగారెడ్డి పట్టణం లోని గురునానక్ మందిర్‌ను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేసిన జగ్గారెడ్డి భూముల పునఃసర్వేపై గ్రామసభ ఎండీ మెడిసిన్‌లో డాక్టర్ ప్రీతి ప్రతిభ.. యూనివర్సిటీ స్థాయిలో నాలుగో ర్యాంక్! *సీసీ రోడ్డు, స్నాన ఘాట్ ప్రారంభించిన ఎమ్మెల్యే* తాత, తండ్రి వారసత్వం పాలకొల్లు మున్సిపాలిటీలో 88 పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల. 27న అభ్యంతరాల స్వీకరణ.. 29న తుది జాబితా ప్రచురణ 53 ఏళ్ల వయసులోనూ సచిన్ టెండూల్కర్ అద్భుతమైన ఫిట్‌నెస్ రహస్యం.. ఆ అలవాట్లతోనే నిత్యం యంగ్ లుక్ ఆత్మకూరులో మరో కీలకనేత వైసీపీ కి గుడ్ బై కడియద్ద గ్రామంలో ఎన్నికల అవగాహన సమావేశం చేర్యాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి. ఓటేసి ఆశీర్వదించండి. అండగా ఉంటాం జలదంకి లో టిడిపి ఇంటింటి ప్రచారం

తాత, తండ్రి వారసత్వం - ఆత్మకూరు అభివృద్ధిలక్ష్యం - తల్లితో రాజకీయ రంగ ప్రవేశం చేసిన యువ నేత తారక్ రెడ్డి

Select Suryaa Now
తాత, తండ్రి వారసత్వం - ఆత్మకూరు అభివృద్ధిలక్ష్యం - తల్లితో రాజకీయ రంగ ప్రవేశం చేసిన యువ నేత తారక్ రెడ్డి

ఆత్మకూరు,మేజర్ న్యూస్: ఆత్మకూరు నియోజకవర్గంలో, ఆత్మకూరు పట్టణంలో తమ తాత, తండ్రి ప్రజలకు అందించిన వైద్య సేవలు, సాధించిన అభివృద్ధి కార్యక్రమాలు, కల్పించిన మౌలికవసతులు తదితరాలతో వారి రాజకీయ వారసత్వంగా ఆత్మకూరు అభివృద్ధి, ప్రజాసేవ పరమావధిగా తన తల్లి డాక్టర్ షకీలా తో పాటు రాజకీయ రంగ ప్రవేశం చేసిన యువ నేత బి ఎస్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ బొమ్మిరెడ్డి వంశ యువ కెరటం బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డి తొలి ప్రయత్నం లోనే అశేష ప్రజాదరణ పొందుతున్నారు. ఆత్మకూరు నియోజకవర్గానికి మూడు దఫాలు శాసనసభ్యులుగా ఉన్న ఆత్మకూరు పట్టణంలో బిఎస్సార్ హాస్పిటల్  నిర్వహిస్తున్న డాక్టర్ బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి వైద్య సేవలతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఆత్మకూరులో నిర్వహించారు. ఆయన కుమారుడు డాక్టర్ బొమ్మిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి హాస్పిటల్ ద్వారా వైద్య సేవలు అందించడంతోపాటు ఆత్మకూరు మండలాధ్యక్షుడుగా, ఆత్మకూరు మేజర్ పంచాయతీ సర్పంచ్గా, జిల్లా టెలికాం సలహా మండల సభ్యులుగా, ఆత్మకూరు ఆర్టీసీ డిపో నేషనల్ మజ్దూర్ యూనియన్ గౌరవాధ్యక్షుడుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో పాటు అన్ని వర్గాల ప్రజలకు విశేష సేవలు అందించారు.వారి వారసత్వంగా వారిలాగే తమ వంతు సేవలు అందించాలన్న సంకల్పం, అనాదిగా ఆదరిస్తున్న ఆత్మకూరును అభివృద్ధి పరచాలన్న లక్ష్యం, అనాదిగా అండగా ఉన్న ఆత్మకూరు ప్రజలకు సేవలు అందించాలన్న ధ్యేయంతో డాక్టర్ సుందర్ రామిరెడ్డి మనుమడు డాక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి తనయుడు యువనేత బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డి అనూహ్యంగా తన తల్లి బి ఎస్ ఆర్ హాస్పిటల్ నిర్వాహకురాలు వైద్య నిపుణులు డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా తో కలిసి ఈ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు
ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఆత్మకూరు నియోజకవర్గంలో నాడు నేడు అనూహ్యంగా అభివృద్ధి పరిచిన పరుస్తున్న రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆశీస్సులతో ఆయన ఆహ్వానంతో బొమ్మిరెడ్డి తారకనాథరెడ్డి, డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా లు రాజకీయ రంగ ప్రవేశం చేసి తెలుగుదేశం పార్టీలో చేరి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆత్మకూరు మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా కూటమి ఆధ్వర్యంలోని తెలుగుదేశం తరఫున డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా పోటీ చేస్తున్నారు. రాజకీయ రంగ ప్రవేశంతోనే డాక్టర్ షకీలాకు ఆమె తనయుడు తారక్నాథరెడ్డికి మున్సిపల్ పరిధిలో అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది. ఎన్నికల్లో విజయం సాధించే చే పరిస్థితులు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అటు మంత్రి ఆనం చేస్తున్న అభివృద్ధి,ఇటు బొమ్మిరెడ్డి కుటుంబంలో అందించిన వైద్య సేవలు అందిస్తున్న సేవలు గతంలో చేసిన అభివృద్ధి పనులు వారికి కలిసొచ్చిన అంశాలుగా ఆత్మకూరు ప్రజలు విశేషంగా ఆదరించి ఆశీర్వదించి అభిమానిస్తున్నారు. డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా చైర్పర్సన్ అభ్యర్థిగా తెలుగుదేశం తరఫున పోటీలో ఉంటూ అన్ని వార్డుల్లో ముమ్మరంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ అన్ని వర్గాల ఆదరణ పొందుతూ విజయ పదం వైపు దూసుకెళ్తున్నారు. కాగా తారక్ నాథ్ రెడ్డి అనాదిగా అందిస్తున్న సామాజిక సేవలు, తమ తాత, తండ్రి అందించిన సేవలు అన్ని వర్గాల ప్రజలతో ఉంటున్న మమేక విధానం ఆయనకు నేడు అత్యంత ప్రజాదరణ లభించే పరిస్థితి ఏర్పడింది. ఆత్మకూరులో అనూహ్యంగా అభివృద్ధి చేస్తున్న ఆనం రామనారాయణరెడ్డి ఆశీస్సులతో సహకారంతో ఆత్మకూరు మున్సిపాలిటీని అనూహ్యంగా అభివృద్ధి పరిచి గ్రేడ్ 2 మున్సిపాలిటీగా మార్పించాలని, ప్రజల అవసరాలను తీర్చాలని, ప్రజా సమస్యల పరిష్కరించాలని, అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలన్న సంకల్పంతో ఉన్నామని అందుకే రాజకీయ రంగ ప్రవేశం చేశామని డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా, బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డి పేర్కొంటున్నారు. మొత్తం మీద తొలి రాజకీయ రంగ ప్రవేశం చేసిన డాక్టర్ షకీలా రెడ్డి, బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డిలకు తొలి ప్రయత్నం లోనే విశేష ప్రజాదరణ లభిస్తుంది.