BREAKING
ఒక అవకాశం ఇస్తే.. అభివృద్ధి చేసి చూపిస్తా... కేశవరెడ్డి..! భూమికి ముప్పు పొంచి ఉందన్న ఐక్యరాజ్యసమితి హెచ్చరిక గోపాలపురం మండలంలో పోటీలో 34 మంది,ఇద్దరు టిడిపి సభ్యులు ఏకగ్రీవం రాడికో ఖైతాన్ కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు మైల్వార్‌లో ప్రభుత్వ భూమి ఆక్రమణపై అధికారుల నిర్లక్ష్యం.. అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలి: కాంగ్రెస్ యువజన అధ్యక్షుడు విష్ణువర్ధన్ డిమాండ్ జర్మనీ పారిశ్రామిక రంగంలో టీకే ఎలివేటర్ రికార్డు స్థాయి వార్షిక లాభాలు నాటో కూటమిలో యూరప్ పేట్రియాట్ క్షిపణి నిర్వహణ కేంద్రానికి ఆతిథ్యం స్పానిష్ ప్రభుత్వానికి సెయుటా సరిహద్దు అల్లర్ల గోప్యతా దస్తావేజుల బహిర్గతానికి ఆదేశం అభివృద్ధి కూటమి మంత్రం -ప్రతి డివిజన్లో ఇంటింటి హోరెత్తిన ప్రచార జోరు -మేయర్ అభ్యర్థి జేబీకి అడుగడుగునా జననీరాజనం -జననీరాజనానికి కూటమి అభివృద్ధి సాక్షి : ఎన్డీఏ మేయర్ అభ్యర్థి జేబీ ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్: కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అబివృద్ధి మంత్రం చూసి ప్రజలు చూపిస్తున్న జననీరాజన సూర్య ఎఫెక్ట్‌.. అక్రమ మట్టి డంపింగ్‌పై అధికారుల కొరడా.. జేసీబీ, లారీ సీజ్‌ రైతులను అతలాకుతులం చేసిన తుఫాన్ విజన్ ఆఫ్ రామాయణ స్పెషల్ వీడియో విడుదల.. మైండ్ బ్లాకింగ్ మేకింగ్ విజువల్స్‌తో రణ్ బీర్, సాయిపల్లవిల హంగామా బ్రెజిల్‌లో తీవ్ర రాజకీయ దుమారం చిన్న పిల్లల వైద్యుడు డా. హరి మృతి రాష్ట్రం బాగుండడమే కూటమి లక్ష్యం : ఎమ్మెల్యే విజయచంద్ర

ఏపీ మానవ హక్కుల కమిషన్ సభ్యుడిగా విశ్రాంత జడ్జి నేరెళ్ల శ్రీనివాసరావు

Select Suryaa Now
ఏపీ మానవ హక్కుల కమిషన్ సభ్యుడిగా విశ్రాంత జడ్జి నేరెళ్ల శ్రీనివాసరావు

కావలి,   మేజర్ న్యూస్ :    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (AP HRC) జ్యుడీషియల్ సభ్యుడిగా విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి నేరెళ్ల శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కావలి పట్టణానికి చెందిన ప్రముఖ ఆర్యవైశ్య నేత, వ్యాపారవేత్త గ్రంధి యానాశెట్టి అల్లుడైన నేరెళ్ల శ్రీనివాసరావుకు ఈ కీలక బాధ్యతలు దక్కడం పట్ల పట్టణప్రజలు,బంధుమిత్రులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
సమర్థవంతమైన సేవలకు దక్కిన గుర్తింపు
నేరెళ్ల శ్రీనివాసరావు గతంలో కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా విశేష సేవలందించారు. తన పదవీకాలంలో న్యాయవ్యవస్థలో 'బార్ అండ్ బెంచ్' మధ్య సత్సంబంధాలను కొనసాగిస్తూ, న్యాయవాదులు, ప్రజల మన్ననలు పొందారు. పెండింగ్ కేసుల పరిష్కారంలో, బాధితులకు సత్వర న్యాయం అందించడంలో ఆయన చూపిన చొరవ ప్రశంసలు అందుకుంది.
కర్నూలు కేంద్రంగానే కీలక బాధ్యతలు
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ప్రధాన కార్యాలయం కర్నూలులోనే ఉన్న నేపథ్యంలో, గతంలో అక్కడే జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన అనుభవం ఉన్న శ్రీనివాసరావును జ్యుడీషియల్ సభ్యుడిగా నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మానవ హక్కుల పరిరక్షణలో ఆయన అనుభవం ఎంతగానోదోహదపడుతుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.
అభినందనల వెల్లువ
హెచ్‌ఆర్‌సీ సభ్యుడిగా నియమితులైన నేరెళ్ల శ్రీనివాసరావుకు కర్నూలు జిల్లా కలెక్టర్ ఏ. సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఆయన ఆధ్వర్యంలో కమిషన్ సేవలు మరింత విస్తృతంగా ప్రజలకు అందుతాయని ఆకాంక్షించారు. అలాగే కావలి పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు, న్యాయవాదులు, ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు, బంధుమిత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.