రిటర్నింగ్ అధికారికి బీ-ఫారాలు అందజేసిన టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రౌతు వేణుగోపాల్ నాయుడు .
సీతానగరం,అక్టోబర్ 27, మేజర్ న్యూస్....ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ ల ప్రక్రియ ముగింపు దశకు చేరుకోవ డంతో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ బరిలో ఉన్న అభ్యర్థులకు సంబంధించిన బి-ఫారాలను మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి రౌతు వేణుగోపాల్ నాయుడు మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి కే అప్పలనాయుడు కి మంగళ వారం అందజేశారు. ఈ మేరక ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జరగను న్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగముగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు గెలుపే ధ్యేయంగా ప్రతి గడపగడపకు వెళ్లి కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని గతంలో చేసిన అభివృద్ధిని ప్రతి ఒక్క ఓటరుకు వివరంగా వివరించాలని మండలం స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో కానీ ఉన్న నాయకులు ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ఆదేశాల మేరకు ఆయా సెగ్మెంట్లలో గెలిచేలాగే తమ వంతు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాలకు చెందిన టిడిపి పార్టీ నాయకులు పాల్గొన్నారు.