దోశలు వేస్తూ ప్రజలతో మమేకమైన తెదేపా అభ్యర్థులు.
సూర్య న్యూస్ అద్దంకి.
అద్దంకి మున్సిపల్ ఎన్నికలు ప్రచారం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు అభ్యర్థులు చేపట్టిన ప్రచారం స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రచారంలో భాగంగా తెదేపా చైర్మన్ అభ్యర్థి కాకాని అశోక్, 19 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి చిన్ని మానస ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఇంటింటా జోరుగా ప్రచారం నిర్వహించారు. సామాన్య ప్రజలతో నేరుగా మమేకమయ్యారు. దారిలో కనిపించిన ఓ అల్పాహార కొట్టు వద్దకు వెళ్లి ఉత్సాహంగా దోశ వేస్తూ స్థానికులను ఆశ్చర్యపరిచారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున అభ్యర్థులతో పాటు నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొని సైకిల్ గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని స్థానికులను అభ్యర్థించారు. ముందుగా గాంధీ బొమ్మ సెంటర్ వద్ద గల ధన్వంతరి దత్త పాదుకా క్షేత్రంలో పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.