BREAKING
జయసూర్య 'మాయన్' చాప్టర్ 1 కొత్త పోస్టర్ విడుదల.. ఉత్కంఠ రేపుతున్న మిస్టరీ థ్రిల్లర్ లుక్ స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పని చేయాలి : ఎమ్మెల్యే ఏలూరి ఎస్ఐఆర్‌ పెండింగ్‌ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి - జిల్లా కలెక్టర్ రాజర్షిషా కూటమికి ధరల మంట!... స్థానిక ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదు - టీడీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి.. కొమురం భీమ్‌కు ఘన నివాళులు కూటమి ప్రచార హోరు ఎమ్మెల్యే సొంగాకు ఘన స్వాగతం ప్రజావాణికి 33 దరఖాస్తులు.. ఎఫ్‌ఆర్‌ఎస్‌ అమలులో నిర్లక్ష్యం వద్దు -ప్రజా ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ప్రతి రోజూ చేరికలే.. పార్టీకి పెరుగుతున్న ఆదరణ! అటవీ సంపదపై కళాకారుల ప్రచారం వేతనాలు చెల్లించాలని ఎం పి డివో కు వినతి పైడి తల్లి ఆశీస్సులు అందరి పై ఉండాలి *స్థానిక ఎన్నికల్లో కూటమిదే విజయం * నామినేషన్ల ఉపసంహరణ దేవునిగూడెంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు అల్లీపురం గ్రామంలో బాలల హక్కులు,పలు అంశాలపై విస్తృత అవగాహన కార్యక్రమం

మహర్షి వాల్మీకి ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం

Select Suryaa Now
మహర్షి వాల్మీకి ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం

సూర్య డిచ్ పల్లీ :7వ బెటాలియన్ లో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.అనంతరం మహర్షి వాల్మీకి చిత్రపటానికి అసిస్టెంట్ కమాండెంట్ డి. శ్రీనివాస్ ,విజయ్ కుమార్, పూలమాలవేసి , పుష్పాంజలి ఘటించి, మహర్షి వాల్మీ చిత్రపటం ముందు ఘన నివాళులు అర్పించారు. మహర్షి వాల్మీకి రచించిన రామాయణం భారతీయ సంస్కృతి, ధర్మం, నైతిక విలువలకు ప్రతీకగా నిలిచిందని, ఆయన సాహిత్య సేవలు సమాజానికి చిరస్మరణీయమని వక్తలు పేర్కొన్నారు.మహర్షి వాల్మీకి జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని, కృషి, పట్టుదల, సత్ప్రవర్తనతో మనిషి ఉన్నత స్థాయికి ఎదగవచ్చని అధికారులు అన్నారు. ఆయన బోధించిన సత్యం, ధర్మం, న్యాయం, మానవతా విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు.వాల్మీకి మహర్షి రచనలు భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని, సమాజంలో నైతిక విలువలు, సోదరభావం, శాంతి, సామరస్యాన్ని పెంపొందించడంలో ఆయన సాహిత్యం కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ డి.శ్రీనివాస్,విజయ్ కుమార్, బెటాలియన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.