telangana
కొమురం భీమ్‌కు ఘన నివాళులు
సూర్య దస్తురాబాద్ : మండల కేంద్రంలో మండల తుడుం దెబ్బ ఆధ్వర్యంలో కొమురం భీమ్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తుడుం దెబ్బ జెండాను ఆవిష్కరించి, కొమురం భీమ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆదివాసీల హక్కుల కోసం కొమురం భీమ్ చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆదివాసీలు పాల్గొన్నారు.