BREAKING
కెనడా దిగుమతులపై అమెరికా టారిఫ్‌లు రెట్టింపు అయితే విధ్వంసకరమే ఫ్రాన్స్‌లో వివాదాస్పద బిల్లుపై తీవ్ర విమర్శలు ఆదర్శ కుటుంబం వేదికపై వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు.. సినిమా విజయంపై టాలీవుడ్ స్టార్ హీరో ఫుల్ కాన్ఫిడెంట్ కాంగోలో ఉగ్రవాదానికి అక్రమ బంగారపు నిధులు ఆదర్శ కుటుంబం వేదికపై ఊహించని పరిణామం.. హీరోయిన్ శ్రీనిధి శెట్టి కాళ్లు మొక్కిన త్రివిక్రమ్ శ్రీనివాస్ సెప్టెంబర్‌లో ఊపందుకున్న కోర్ క్యాపిటల్ గుడ్స్ ఆర్డర్లు మరియు షిప్‌మెంట్లు వార్షిక లాభాల అంచనాలను పెంచిన పానీయాల దిగ్గజం వరుసగా ఆరు ఫ్లాపులు పడినా చెక్కుచెదరని క్రేజ్.. చేతిలో ఏకంగా అరడజను సినిమాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ బ్యూటీ పునర్నిర్మాణ ఖర్చుల భారం తొలగిపోవడంతో భారీగా పెరిగిన లాభాలు మీమ్ వివాదం కారణంగా ఎండార్స్‌మెంట్ల నుంచి తొలగించిన చైనా బ్రాండ్లు ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ స్ట్రీమింగ్ వాణిజ్య ఆంక్షల నడుమ వ్యాపార నిర్వహణపై న్యాయ నిపుణుల విశ్లేషణ సెలబ్రిటీ ప్రకటనల నిబంధనను సమర్థించుకున్న ఫ్లోరిడా బార్.. మోర్గాన్ అండ్ మోర్గాన్ దావాపై స్పందన ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కావాలా.. రోజూ పాటించగల ఈ చిన్న చిన్న మార్పులతో మనశ్శాంతిని సొంతం చేసుకోండి అమెరికా కార్పొరేట్ రంగంలో యాంటీట్రస్ట్ గండం

స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి

Select Suryaa Now
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి

సూర్య స్టేట్ బ్యూరో, అమరావతి : స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అన్నారు. సోమవారం కొండపి నియోజకవర్గం టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం, ఎం. నిడమానూరు, పొందూరు గ్రామాల్లో టీడీపీ నాయకులు కార్యకర్తలతో మంత్రి సమావేశమై స్థానిక ఎన్నికలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ.... స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త పనిచేయాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఎవరికీ ఇచ్చినా అంతా కలిసికట్టుగా పని చేయాలన్నారు. అభివృద్ధి,సంక్షేమం రెండు కళ్ళుగా కూటమి పాలన సాగుతోందన్నారు. సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేశామని  దేశానికే ఆదర్శంగా మన రాష్ట్ర సంక్షేమం నిలుస్తోందన్నారు.  దేశంలో ఏ రాష్ర్టంలో లేని విధంగా పెద్ద మెత్తంలో ఫించన్లు ఇస్తున్నామని, అన్న క్యాంటీన్లతో  పేదలకు రూ. 5 భోజనం పెడుతున్నామన్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నాం. ఎన్నికల్లో చెప్పకపోయినా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి పాలనలో గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి, కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఇవన్నీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు తెలియచెప్పాలన్నారు.  స్థానిక సంస్థల ఎన్నికల్లో  కూటమి నాయకులతో సమన్వయంతో పనిచేసి కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి కోరారు.