వార్డు మెంబర్స్ ఫోరమ్ అధ్యక్షుడిగా రాము
నవాబుపేట సూర్య న్యూస్: మండల వార్డు మెంబర్స్ ఫోరమ్ నూతన అధ్యక్షుడిగా వెంకట నారాయణ(రాము) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.తెలంగాణ వార్డు మెంబర్స్ ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షురాలు నాగబెల్లి జ్యోతి మహేష్ ఆదేశాల మేరకు,జిల్లా ఫోరమ్ ఇన్‌ఛార్జ్ చిన్నారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో వెంకట నారాయణను మండల అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు వెంకట నారాయణ మాట్లాడుతూ..తనపై నమ్మకంతో అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షురాలు నాగబెల్లి జ్యోతి మహేష్,జిల్లా ఇన్‌ఛార్జ్ చిన్నారెడ్డితో పాటు మండలంలోని వార్డు సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.వార్డు సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి,వారి హక్కుల సాధనకు నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఫోరమ్ ముఖ్య నాయకులు,మండల పరిధిలోని పలువురు వార్డు సభ్యులు పాల్గొన్నారు.