ప్రజావాణిలో ఎంపీడీవో యాదగిరి కి వినతిపత్రం అందజేసిన మెట్టు శ్రీధర్
పటాన్‌చెరు;చిట్కుల్ గ్రామంలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీ 7వ వార్డు పరిధిలో ఆమోదిత లేఅవుట్లలో కేటాయించిన పార్కులు, రహదారులు, ఇతర ఉమ్మడి స్థలాలను పరిరక్షించాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీధర్ కోరారు.ఈ మేరకు ప్రజావాణిలో ఎంపీడీవో యాదగిరికి వినతిపత్రం సమర్పించారు. పార్కులు, రహదారుల స్థలాల్లో ప్రహరీ గోడల నిర్మాణం,ఆక్రమణలపై అధికారులు విచారణ జరపాలని కోరారు. మున్సిపల్ టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, హెచ్‌ఎండీఏ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయి పరిశీలన చేసి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు ప్లాట్లు, ఇళ్లు కొనుగోలు చేసే ముందు ఆమోదిత లేఅవుట్లు, భూమి హక్కులు, అనుమతులు, కోర్టు వివాదాలను పరిశీలించాలని సూచించారు. ప్రజా స్థలాలను కాపాడి, కొనుగోలుదారుల ప్రయోజనాలను పరిరక్షించాలని మెట్టు శ్రీధర్‌తో పాటు రాజగోపాల్ యాదవ్, శ్రీకాంత్, మాణిక్య ప్రభు కోరారు.