జనసేనలో చేరిన వైసిపి యూత్ అధ్యక్షులు
నరసాపురం రూరల్, మేజర్ న్యూస్ : ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ సమక్షంలో జనసేన గూటికి రుస్తుంబాద వైసీపీ యూత్ ప్రెసిడెంట్ బళ్ల మణికంఠ చేరారు. సోమవారం స్థానిక వైసీపీ కార్యాలయంలో గ్రామ వైసిపి యువత, అనుచరులు జనసేన కండువా కప్పుకున్నారు.
నియోజకవర్గంలో సాగుతున్న అభివృద్ధి పర్వంలో భాగస్వాములయ్యేందుకు యువత స్వచ్ఛందంగా ముందుకు వస్తోందని,కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, రుస్తుంబాద వైసీపీ యూత్ ప్రెసిడెంట్ బళ్ల మణికంఠ, ఆయన అనుచరులు పార్టీలో చేరినట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ తెలిపారు.
నూతనంగా పార్టీలో చేరిన మణికంఠ కి ఎమ్మెల్యే పార్టీ కండువా వేసి అభినందించారు. నియోజకవర్గ ప్రగతిలో యువశక్తి పాత్ర అత్యంత కీలకమని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ రుస్తుంబాద అభివృద్ధిలో క్రియాశీలక భాగస్వామ్యం అందించాలని ఈ సందర్భంగా నాయకర్ సూచించారు. ఈ కార్యక్రమంలో రుస్తుం భాద జనసేన నాయకులు పులి భుజంగరావు, బందెల రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ ఇజ్రాయిల్ నరసాపురం పశ్చిమగోదావరి జిల్లా,