BREAKING
కెనడా దిగుమతులపై అమెరికా టారిఫ్‌లు రెట్టింపు అయితే విధ్వంసకరమే ఫ్రాన్స్‌లో వివాదాస్పద బిల్లుపై తీవ్ర విమర్శలు ఆదర్శ కుటుంబం వేదికపై వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు.. సినిమా విజయంపై టాలీవుడ్ స్టార్ హీరో ఫుల్ కాన్ఫిడెంట్ కాంగోలో ఉగ్రవాదానికి అక్రమ బంగారపు నిధులు ఆదర్శ కుటుంబం వేదికపై ఊహించని పరిణామం.. హీరోయిన్ శ్రీనిధి శెట్టి కాళ్లు మొక్కిన త్రివిక్రమ్ శ్రీనివాస్ సెప్టెంబర్‌లో ఊపందుకున్న కోర్ క్యాపిటల్ గుడ్స్ ఆర్డర్లు మరియు షిప్‌మెంట్లు వార్షిక లాభాల అంచనాలను పెంచిన పానీయాల దిగ్గజం వరుసగా ఆరు ఫ్లాపులు పడినా చెక్కుచెదరని క్రేజ్.. చేతిలో ఏకంగా అరడజను సినిమాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ బ్యూటీ పునర్నిర్మాణ ఖర్చుల భారం తొలగిపోవడంతో భారీగా పెరిగిన లాభాలు మీమ్ వివాదం కారణంగా ఎండార్స్‌మెంట్ల నుంచి తొలగించిన చైనా బ్రాండ్లు ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ స్ట్రీమింగ్ వాణిజ్య ఆంక్షల నడుమ వ్యాపార నిర్వహణపై న్యాయ నిపుణుల విశ్లేషణ సెలబ్రిటీ ప్రకటనల నిబంధనను సమర్థించుకున్న ఫ్లోరిడా బార్.. మోర్గాన్ అండ్ మోర్గాన్ దావాపై స్పందన ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కావాలా.. రోజూ పాటించగల ఈ చిన్న చిన్న మార్పులతో మనశ్శాంతిని సొంతం చేసుకోండి అమెరికా కార్పొరేట్ రంగంలో యాంటీట్రస్ట్ గండం

విద్యుత్ షాక్‌తో యమహా షోరూం మెకానిక్ మృతి! వాటర్ సర్వీసింగ్ చేస్తుండగా ప్రమాదం..

Select Suryaa Now
విద్యుత్ షాక్‌తో యమహా షోరూం మెకానిక్ మృతి! వాటర్ సర్వీసింగ్ చేస్తుండగా ప్రమాదం..

పొదలకూరు, మేజర్ న్యూస్ :   నెల్లూరు జిల్లా పొదలకూరులో సోమవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానిక యమహా షోరూంలో మెకానిక్‌గా పనిచేస్తున్న యువకుడు విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయాడు. బైక్‌కు వాటర్ సర్వీసింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

విధుల్లో ఉండగా ప్రమాదం  నెల్లూరు నగరంలోని డైకస్ రోడ్డులో ఉన్న ఎన్‌సీసీ కాలనీకి చెందిన మోహిద్‌ (29) పొదలకూరులోని యమహా షోరూంలో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ప్రతిరోజూ నెల్లూరు నుంచి పొదలకూరుకు వచ్చి విధులు నిర్వహించి తిరిగి ఇంటికి వెళ్లేవాడు. ఈ క్రమంలో సోమవారం యథావిధిగా విధుల్లో ఉన్న మోహిద్‌ బైక్‌కు వాటర్ సర్వీసింగ్ చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.

కుటుంబంలో తీరని విషాదం  మోహిద్‌కు భార్యతో పాటు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. కుటుంబానికి ఆధారంగా ఉన్న యువకుడు ఆకస్మికంగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. చిన్న వయసులోనే మోహిద్‌ మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న పొదలకూరు ఎస్ఐ శివరాకేష్ ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.