BREAKING
నైతిక విలువల పెంపునకు పరివర్తన్ 28న ముత్యాలమ్మ ఆలయ హుండీ లెక్కింపు.. ఆలయ ఓ వెంకటేశ్వర్లు అర్ధగిరి స్వామిని దర్శించుకున్న అపోలో వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి - తీర్థప్రసాదాలు అందజేసిన చైర్మన్ రఘుపతి, ఈఓ మునిశేఖర్ జయమ్ము నిశ్చయమ్మురా 2 షోలో ఏపీ మంత్రి నారా లోకేశ్ సందడి.. బాలకృష్ణ డైలాగ్‌తో అదుర్స్ ఓటీటీ వేదికగా రానున్న రజినీకాంత్ జైలర్ 2.. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ సూర్య కథనానికి స్పందన.. కొండాపూర్‌కు ఎంపీఓ! స్థానిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా లాడ్జిల్లో పోలీసుల తనిఖీలు - చిత్తూరు 2 టౌన్ పరిధిలో లాడ్జిలను తనిఖీ చేసిన ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ హషం - రిజిస్టర్లు, గుర్తింపు పత్రాల పరిశీలన ఐఓటీ భద్రతపై పరిశోధన.. ప్రేమలతకు పీహెచ్‌డీ భువనేశ్వరి జగదీష్ నాయుడు గెలుపే లక్ష్యంగా నాయకుల ప్రచారం *కాజిపల్లి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలి* 53వ డివిజన్‌లో కూటమి అభ్యర్థి కోలా తేజస్‌ విస్తృత ప్రచారం.. పదవి అంటే అలంకరణ కాదు.. ప్రజలకు సేవ చేసే బాధ్యత *వరంగల్ డిక్లరేషన్‌లో హామీ ఇచ్చారు.. రుణమాఫీ ఎక్కడ?* చిత్తూరులో కూటమి అభ్యర్థుల అఖండ విజయం ఖాయం! మేయర్ అభ్యర్థి కటారి హేమలత, 53వ డివిజన్ అభ్యర్థి షర్మిలకు భారీ మెజార్టీ తథ్యం టీడీపీ సీనియర్ నాయకుడు పి. షణ్ముగం, యువ కార్పొరేటర్ చందు ధీమా. ఇండిపెండెంట్ మేయర్ అభ్యర్థి దీనా గ్లాడి ని గెలిపించండి. కుందుర్పి లో జోరుగా వైసిపి ఎన్నికల ప్రచారం

25వ వార్డులో బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డి ఇంటింటా ప్రచారం

Select Suryaa Now
25వ వార్డులో బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డి ఇంటింటా ప్రచారం

25వ వార్డులో బొమ్మిరెడ్డి తారకనాథ్ రెడ్డి ఇంటింటి ప్రచారం
--అల్లిపురంలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా విస్తృత ప్రచారం
--బ్రహ్మరథం పట్టిన ప్రజలు 
ఆత్మకూరు, సోమా వెంకటసుబ్బయ్య,మేజర్ న్యూస్ : ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని 25వ వార్డు అల్లిపురంలో కూటమి నాయకుడు బొమ్మిరెడ్డి తారకనాథ్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ తెలుగుదేశం అభ్యర్థి డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా , 25వ వార్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి డక్కా రవణమ్మలకు అందరూ ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తారక్ నాథ్ రెడ్డి ఓటర్లను కోరారు. ఆయన ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుంటూ కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం లక్ష్యంగా కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు.ఈ సందర్బంగా గత యాభై సంవత్సరాలుగా తమ తాత డాక్టర్ బొమ్మిరెడ్డి సుందర రామిరెడ్డి, తమ తండ్రి డాక్టర్ బొమ్మిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అందించిన వైద్య సేవలు, ప్రజా సేవకు, సామాజిక సేవలను ఆయన గుర్తుచేశారు. తమ తల్లి డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా అందిసున్న వైద్య, సామాజిక సేవలను ఆయన వివరించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అందరికీ తెలిసినవేనని, కళ్ళముందు కనిపించేవేనని ఆయన పేర్కొన్నారు. అన్నింటిని గుర్తించి అందరూ ఆదరించి ఆశీర్వదించి ఓట్లు వేసి విజయం చేకూర్చాలని, తమవంతు వైద్య సేవలతో పాటు ప్రభుత్వం ద్వారా మంత్రి ఆనం సహకారంతో ప్రజా సేవలందిస్తామని ఆయన పేర్కొన్నారు.
ఈ ప్రచార కార్యక్రమంలో బొమ్మిరెడ్డి తారకనాథ్ రెడ్డితో పాటు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రచారాన్ని కొనసాగించారు.