telangana
అటవీ సంపదపై కళాకారుల ప్రచారం
సూర్య, జన్నారం : జన్నారం అటవీ డివిజన్ లోని పలు గ్రామాలలో అటవీ సంపదపై కళాకారులు ప్రచారం చేశారు. అటవీ సంపదను కాపాడుకుంటేనే మానవుని మనుగడకు ఎంతగానో ఉపయోగపడుతుందని కళాకారులు పాటల రూపంలో ప్రజలకు వివరించారు. అడవిని కాపాడుకుంటామని గ్రామస్తులు ప్రతిజ్ఞ చేశారు. సోమవారం జన్నారం మండలం తపాలాపూర్, మమ్ముదాబాద్ గ్రామాలలో అటవీ శాఖ అధికారుల సహకారంతో కళాకారులు అటవీ సంపదపై ప్రజలను ఆకట్టుకునే విధంగా పాటలు పాడి అందరినీ అబ్బురపరిచారు. ఈ కార్యక్రమంలో కళాకారులు లింగంపల్లి రాజలింగు, సెక్షన్ ఆఫీసర్లు బగవంతరావు, అతావుల్లా, బీటా ఆఫీసర్లు అనిత, కృష్ణమూర్తి, బేస్ క్యాంప్ సిబ్బంది, జిల్లపల్లి గోపాల్, రామటెంకి శంకర్ తదితరులు పాల్గొన్నారు.