BREAKING
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కళాకారుల ఐక్యతే మన బలం విద్యుత్ షాక్‌తో యమహా షోరూం మెకానిక్ మృతి! వాటర్ సర్వీసింగ్ చేస్తుండగా ప్రమాదం.. ఏఐటీఏ ఎన్నికల బరిలోకి సానియా మీర్జా, మహేశ్ భూపతి.. పోటీకి దూరంగా నిలిచిన లియాండర్ పేస్ నెల్లూరు రూరల్ టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా చెన్నారెడ్డి శ్రీనివాసులురెడ్డి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఆత్మకూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి ప్రజావాణిలో ఎంపీడీవో యాదగిరి కి వినతిపత్రం అందజేసిన మెట్టు శ్రీధర్ డబుల్ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో వివాదాస్పద నిర్ణయం.. అంపైర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన దేవదత్ పడిక్కల్ జడ్పిటిసి కి 12 నామినేషన్లు ఎంపీటీసీ కి 218 నామినేషన్లు ఉపసంహరణ జనసేనలో చేరిన వైసిపి యూత్ అధ్యక్షులు 25వ వార్డులో బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డి ఇంటింటా ప్రచారం హర్మన్‌ప్రీత్ శతక జోరు.. జింబాబ్వేపై ఘన విజయంతో సిరీస్ కైవసం చేసుకున్న భారత మహిళల జట్టు *కల్హేర్ మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎంపీ సురేష్ షట్కర్ ఎమ్మెల్యే డా. పట్లోళ్ల సంజీవరెడ్డి* *మర్డి గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎంపీ ఎమ్మెల్యే*

పైడి తల్లి ఆశీస్సులు అందరి పై ఉండాలి *స్థానిక ఎన్నికల్లో కూటమిదే విజయం *

Select Suryaa Now
పైడి తల్లి ఆశీస్సులు అందరి పై ఉండాలి  *స్థానిక ఎన్నికల్లో కూటమిదే విజయం *

విజయనగరం బ్యూరో, సూర్య : ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాన్ని ప్రభుత్వమే ఘనంగా నిర్వహిస్తోందనీ , తల్లి ఆశీస్సులు అందరి పై ఉండాలనీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్ కారణంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ తగ్గించామన్నారు. గత ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బందులు గురిచేశారో అందరం చూశాం అని ఈ రెండున్నరేళ్లలో మేము ఏం చేశామో ప్రతి ఇంటికి వెళ్లి చెబుతున్నాం అన్నారు. ప్రజలకు దగ్గర కావాలనే ఆలోచనతో కూటమి ఉందనీ పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా కూటమి నాయకులు అంతా చూస్తున్నాం అన్నారు. గతంలో జగన్ మోహన్ రెడ్డి ఎంత అరాచకం చేశారో చూశాం అన్నారు.  సొంత మేనకోడలి పెళ్లికి కూడా తన బిల్డింగ్ ఇవ్వలేదనీ రిజర్వేషన్ కోసం మా నాయకులు నామినేషన్ కూడా వేయలేకపోయారనీ నేడు కూటమి నాయకత్వంలో అందరికీ న్యాయం జరిగేలా చూస్తున్నాం అన్నారు.
ఈ స్థానిక ఎన్నికల్లో మేము 100% ఘన విజయం సాధిస్తాం అన్నారు.

జగన్ పై మంత్రి ఫైర్:

రాష్ట్రాన్ని నెంబర్-1 చేయాలని సీఎం చంద్రబాబు కృషి చేస్తుంటే, రావణ కాష్టంలా మార్చేందుకు జగన్ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. గొడ్డలి పార్టీ అరాచకాలు పుంగనూరు, రాయచోటి, కడప, పులివెందులలో ప్రజలంతా చూశారని, 2021 స్థానిక ఎన్నికల్లో 1,045 బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ, 322 అక్రమ కేసులు, 160 దాడులు, 3 హత్యలు చేశారని గణాంకాలతో సహా వివరించారు. పుంగనూరులో 85కి 85 పంచాయతీలు, మాచర్లలో 77కి 74 పంచాయతీలు బలవంతపు ఏకగ్రీవాలు చేసిన చరిత్ర వైసీపీదన్నారు. పంచాయతీ నిధులు రూ.12,600 కోట్లు అడ్డుకుని, బీసీలకు టిక్కెట్లు ఇస్తే దళితులతో దాడులు చేయించి 59 కేసులు పెట్టారని, మేనకోడలి పెళ్లికి అడ్డుపడిన మేనమామగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని ఎద్దేవా చేశారు.

రిపోర్టర్ :  డేవిడ్ రాజు, విజయనగరం.