BREAKING
అవనిగడ్డలో జోరుగా తెలుగుదేశం ప్రచారం ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసిన జయలక్ష్మి నైతిక విలువల పెంపునకు పరివర్తన్ 28న ముత్యాలమ్మ ఆలయ హుండీ లెక్కింపు.. ఆలయ ఓ వెంకటేశ్వర్లు అర్ధగిరి స్వామిని దర్శించుకున్న అపోలో వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి - తీర్థప్రసాదాలు అందజేసిన చైర్మన్ రఘుపతి, ఈఓ మునిశేఖర్ జయమ్ము నిశ్చయమ్మురా 2 షోలో ఏపీ మంత్రి నారా లోకేశ్ సందడి.. బాలకృష్ణ డైలాగ్‌తో అదుర్స్ ఓటీటీ వేదికగా రానున్న రజినీకాంత్ జైలర్ 2.. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ సూర్య కథనానికి స్పందన.. కొండాపూర్‌కు ఎంపీఓ! స్థానిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా లాడ్జిల్లో పోలీసుల తనిఖీలు - చిత్తూరు 2 టౌన్ పరిధిలో లాడ్జిలను తనిఖీ చేసిన ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ హషం - రిజిస్టర్లు, గుర్తింపు పత్రాల పరిశీలన ఐఓటీ భద్రతపై పరిశోధన.. ప్రేమలతకు పీహెచ్‌డీ భువనేశ్వరి జగదీష్ నాయుడు గెలుపే లక్ష్యంగా నాయకుల ప్రచారం *కాజిపల్లి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలి* 53వ డివిజన్‌లో కూటమి అభ్యర్థి కోలా తేజస్‌ విస్తృత ప్రచారం.. పదవి అంటే అలంకరణ కాదు.. ప్రజలకు సేవ చేసే బాధ్యత *వరంగల్ డిక్లరేషన్‌లో హామీ ఇచ్చారు.. రుణమాఫీ ఎక్కడ?* చిత్తూరులో కూటమి అభ్యర్థుల అఖండ విజయం ఖాయం! మేయర్ అభ్యర్థి కటారి హేమలత, 53వ డివిజన్ అభ్యర్థి షర్మిలకు భారీ మెజార్టీ తథ్యం టీడీపీ సీనియర్ నాయకుడు పి. షణ్ముగం, యువ కార్పొరేటర్ చందు ధీమా. ఇండిపెండెంట్ మేయర్ అభ్యర్థి దీనా గ్లాడి ని గెలిపించండి.

అభివృద్ధి అజండాగా రాజకీయ రంగప్రవేశం

Select Suryaa Now
అభివృద్ధి అజండాగా రాజకీయ రంగప్రవేశం

అభివృద్ధి ఏకైక అజెండాగా రాజకీయ రంగ ప్రవేశం
-- అనాదిగా ఆదరించిన ఆత్మకూరు ప్రజల రుణం తీర్చుకుంటాం 
--సేవలు కొనసాగిస్తాం --ఆత్మకూరు అభివృద్ధికి కృషి చేస్తాం 
--బొమ్మిరెడ్డి షకీలా --బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డి
ఆత్మకూరు,సోమా వెంకటసుబ్బయ్య,మేజర్ న్యూస్: ఆత్మకూరు అభివృద్ధి ఏకైక అజెండాగా తాము రాజకీయ రంగ ప్రవేశం చేశామని, అనాదిగా ఆదరిస్తున్న ఆత్మకూరు ప్రజల రుణం తీర్చుకుంటామని,వైద్య సేవలను మరింత మెరుగ్గా కొనసాగిస్తామని, ఆత్మకూరు అభివృద్ధికి, సమస్యలు పరిష్కారానికి, మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక శ్రద్ధతో కృషి చేస్తామని ఆత్మకూరు మున్సిపల్ చైర్ పర్సన్ టిడిపి అభ్యర్థి డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా,యువనేత, బిఎస్సార్ ట్రస్ట్ చైర్మన్ బొమ్మిరెడ్డి తారకనాథ్ రెడ్డి లు పేర్కొన్నారు.వారు సోమవారం తమ స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. తారక్ నాథ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు,పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లు అన్ని ప్రాంతాల అభివృద్ధికి అన్ని వర్గాల సంక్షేమానికి విశేషంగా కృషి చేస్తున్నారని, ఆత్మకూరు నియోజకవర్గంలో గతంలో అనేక విధాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నిలిపిన నేటి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో ఆత్మకూరు మున్సిపాలిటీ, ఆత్మకూరు నియోజకవర్గాన్ని అత్యధికంగా నిధులు సాధించే అభివృద్ధి పథంలో నిలుపుతున్నారని, దాంతో తాము ఆకర్షితులమయ్యామని, మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి ఆహ్వానంతో రాజకీయ రంగ ప్రవేశం చేసి తెలుగుదేశంలో ప్రవేశించామని, మంత్రి ఆశీస్సులతో తమ తల్లి డాక్టర్ షకీలా ఆత్మకూరు మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా తెలుగుదేశం తరఫున కూటమి ఆధ్వర్యంలో పోటీ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.తమ బి ఎస్ ఆర్ కుటుంబం అనాదిగా హాస్పిటల్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నామని, ఇంకా మెరుగ్గా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. తమ తాత డాక్టర్ బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి3దపాలు శాసనసభ్యులు గా,నాలుగేళ్ల పాటు రాష్ట్ర ఆర్థిక సంస్థ చైర్మన్గా వ్యవహరించారని, ఆ రోజుల్లో ఆత్మకూరుకు ప్రత్యేకంగా జిల్లాలోనే ఏకైక విద్యుత్ సహకార సంస్థ(రీకో )ను సాధించారని తద్వారా, 45 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారని, జిల్లాలోని ఏకైక ఆర్డబ్ల్యూఎస్ బృహత్తర తాగునీటి పథకాన్ని సాధించి 123 గ్రామాలకు తాగునీరు అందించారని, అన్ని ఎస్సీ ఎస్టీ కాలనీలకు విద్యుదీకరణ గావించారని, మారుమూల కుగ్రామాలకు బస్సు వసతి రోడ్డు సౌకర్యం కల్పించారని,సోమశిల ఉత్తర కాలవ ఏర్పాటులో కీలకపాత్ర వహించారని, ఆత్మకూరులో పది పడకల ప్రభుత్వ వైద్యశాలను ముప్పై పడకలుగా అప్ గ్రేడ్ చేయించారని,ఆ రోజుల్లో అనూహ్యంగా డాక్టర్  సుందర రామిరెడ్డి అభివృద్ధి చేశారని,తమ తండ్రి డాక్టర్ బొమ్మిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి వైద్యులుగా వైద్య సేవలనుఅందించడంతో పాటు ఆత్మకూరు మండలాధ్యక్షుడుగా, ఆత్మకూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ గా, జిల్లా టెలికం సభ్యులుగా, ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ గౌరవాధ్యక్షుడుగా అన్ని వర్గాలకు సేవలు అందించడంతోపాటు అనేక పాఠశాలలకు అదనపు తరగతి గదులు మంజూరు చేయించారని, ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి, సమస్యల పరిష్కారానికి, న్యాయమైన కోర్కెల సాధనకు విశేష కృషి చేశారని, ఆత్మకూరులో త్రాగునీటికి కటకట లాడుతున్న సమయంలో ఆయన నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వద్దకు వెళ్లి ఆత్మకూరులో తాగునీటి ఇక్కట్లు గురించి వివరించి పెన్నా నది నుండి ఆత్మకూరు పట్టణానికి త్రాగునీరు అందించే బృహత్తర తాగునీటి పథకాన్ని తమ తండ్రి డాక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి సాధించారని తారక్ నాథ్ రెడ్డి పేర్కొన్నారు. వారి అడుగుజాడల్లో నడవాలని తమవంతుగా హాస్పిటల్ ద్వారా వైద్య సేవలు అందించడంతోపాటు ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టి ప్రభుత్వం ద్వారా కూడా ప్రజలకు సేవలు అందించాలని,ఆత్మకూరు అభివృద్ధి లక్ష్యంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సారధ్యంలో తమ రాజకీయ రంగ ప్రవేశం చేసామని తారక్ నాథ్ రెడ్డి పేర్కొన్నారు.
*రెండువిధాల సేవలందిస్తా*
ఆత్మకూరు మున్సిపల్ చైర్ పర్సన్ తెలుగుదేశం అభ్యర్థి డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా మాట్లాడుతూ తమ కుటుంబం అనాదిగా ప్రజలకు సేవలు అందిస్తుందని, వైద్య సేవలతో పాటు అనేక ప్రజాసేవలను కూడా అందించారని తలవని తలంపుగా రాష్ట్రమంత్రి ఆనం రామ నారాయణరెడ్డి ఆహ్వానంతో రాజకీయ రంగ ప్రవేశం చేసి ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా టిడిపి తరఫున పోటీ చేస్తున్నానని, ఇటు వైద్య సేవలతోపాటు అటు ప్రజలకు ప్రభుత్వ పరంగా సేవలు అందించగలనన్న విశ్వాసంతో లక్ష్యంతో తాను రాజకీయ రంగ ప్రవేశం చేశానన్నారు. రెండింటికీ న్యాయం చేసేలా ప్రత్యేక శ్రద్ధతో కృషి చేస్తానని, యధావిధిగా వైద్య సేవలు అందించడంతోపాటు మంత్రి ఆనం సహకారంతో ఆత్మకూరును అభివృద్ధిపరిచేందుకు తన వంతు ప్రత్యేకంగా కృషి చేస్తానని, విజయం సాధించాక మున్సిపల్ పరిధిలో ఇప్పటికే తమ దృష్టికి వచ్చిన,రానున్న రోజుల్లో తమ దృష్టికి తెచ్చే సమస్యలను తాను నేరుగా పరిశీలించి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటానని డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా పేర్కొన్నారు. ఈ సమావేశంలో బిఎస్ఆర్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శివశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.