BREAKING
వైసిపి ముఖ్య నాయకుడు చిగిచెర్ల రవి టిడిపిలోకి చేరిక… భోగి సినిమా కోసం డబ్బింగ్ పూర్తి చేసిన అనుపమ పరమేశ్వరన్.. శర్వానంద్ పీరియడ్ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలు ఓం మూవీలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా సాయిపల్లవి.. నిత్యారెడ్డి పాత్రతో అదరగొట్టనున్న టాలెంటెడ్ బ్యూటీ పోస్టర్‌పై పెద్ద ఫోటో ఉంటేనే సక్సెస్ అనుకోవడం చిన్న మనస్తత్వమే.. నటి రాధికా ఆప్టే బోల్డ్ కామెంట్స్ శివానంద్ ను పరామర్శించిన మాధవ రెడ్డి! జాతీయ స్థాయి గణిత ఒలింపియాడ్‌లో శ్రీ చైతన్య విద్యార్థుల ప్రతిభ.. 18 మంది విద్యార్థులకు ప్రాంతీయ గణిత ఒలింపియాడ్‌కు అర్హత జోరు పెంచిన రాజారెడ్డి ప్రచారం.. -58వ డివిజన్లో ప్రజలు అడుగడుగున నిరాజనం 7వ వార్డులో '' ఇంటింటికి ..... టీడీపీ''...! డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా -రాయల్ వారి వీధి ప్రచారంలో బోయళ్ళ శాంతి అర్హులైన పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ బ్రాహ్మణపల్లి, కామేపల్లి గ్రామాల్లో గడపగడప ప్రచారంలో జడ్పీటీసీ సభ్యురాలు డాక్టర్ వునం దీపిక పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ గురజాల మండలంలోని బ్రాహ్మణపల్లి, కామేపల్లి గ్రామాల్లో* జరిగిన గడపగడప ప్రచార కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు డాక్టర్ వునం దీపికపాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి తిరుగుత చీరాల బీచ్‌లు తాత్కాలికంగా మూసివేత అవినీతి రహిత సింగరేణి మన లక్ష్యం.. ఎస్వో టు జిఎం డి.వి రామారావు అలయాస్ రుక్మిణి చిత్రం నుంచి రుక్కు రుక్కు రుక్మిణి సాంగ్ ప్రోమో విడుదల.. ఆకట్టుకుంటున్న నితిన్ మాస్ బీట్స్ బుచ్చి10,14 వార్డుల్లో చెప్పాం- చేస్తున్నాం కార్యక్రమం లో ఎమ్మెల్యే

అవనిగడ్డలో జోరుగా తెలుగుదేశం ప్రచారం ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసిన జయలక్ష్మి

Select Suryaa Now
అవనిగడ్డలో జోరుగా తెలుగుదేశం ప్రచారం   ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసిన జయలక్ష్మి

 

అవనిగడ్డ, మేజర్ న్యూస్: స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి బలపరిచిన అవనిగడ్డ మండల జడ్పీటీసీ అభ్యర్థి విక్కుర్తి జయలక్ష్మి సోమవారం దక్షిణ చిరువోలంక గ్రామం నుంచి ప్రచారం ప్రారంభించారు. నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి విక్కుర్తి శ్రీనివాసరావు ప్రచారాన్ని ప్రారంభించగా, దక్షిణ చిరువోలంక ఎంపీటీసీ అభ్యర్థి పి. లంకమ్మ ప్రసాద్‌తో కలిసి జయలక్ష్మి ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిశారు. కరపత్రాలు పంపిణీ చేస్తూ స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. కూటమి అభ్యర్థులకు మద్దతు తెలిపి గెలిపించాలని కోరారు.అనంతరం స్థానిక ఒకటో వార్డు లోని సీతాలంక, కోటగిరిలంక గ్రామాల్లో ఎంపీటీసీ అభ్యర్థి డేగల సుజాతతో కలిసి ప్రచారం నిర్వహించారు. వృద్ధులకు అందిస్తున్న పింఛన్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, గ్రామాల అభివృద్ధిని వివరిస్తూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని జయలక్ష్మి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.✍️ అజంతా శ్రీనివాస్, అవనిగడ్డ, కృష్ణాజిల్లా.