BREAKING
కళాకారుల ఐక్యతే మన బలం విద్యుత్ షాక్‌తో యమహా షోరూం మెకానిక్ మృతి! వాటర్ సర్వీసింగ్ చేస్తుండగా ప్రమాదం.. ఏఐటీఏ ఎన్నికల బరిలోకి సానియా మీర్జా, మహేశ్ భూపతి.. పోటీకి దూరంగా నిలిచిన లియాండర్ పేస్ నెల్లూరు రూరల్ టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా చెన్నారెడ్డి శ్రీనివాసులురెడ్డి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఆత్మకూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి ప్రజావాణిలో ఎంపీడీవో యాదగిరి కి వినతిపత్రం అందజేసిన మెట్టు శ్రీధర్ డబుల్ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో వివాదాస్పద నిర్ణయం.. అంపైర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన దేవదత్ పడిక్కల్ జడ్పిటిసి కి 12 నామినేషన్లు ఎంపీటీసీ కి 218 నామినేషన్లు ఉపసంహరణ జనసేనలో చేరిన వైసిపి యూత్ అధ్యక్షులు 25వ వార్డులో బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డి ఇంటింటా ప్రచారం హర్మన్‌ప్రీత్ శతక జోరు.. జింబాబ్వేపై ఘన విజయంతో సిరీస్ కైవసం చేసుకున్న భారత మహిళల జట్టు *కల్హేర్ మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎంపీ సురేష్ షట్కర్ ఎమ్మెల్యే డా. పట్లోళ్ల సంజీవరెడ్డి* *మర్డి గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎంపీ ఎమ్మెల్యే* సంగారెడ్డిలో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు

ప్రతి రోజూ చేరికలే.. పార్టీకి పెరుగుతున్న ఆదరణ!

Select Suryaa Now
ప్రతి రోజూ చేరికలే.. పార్టీకి పెరుగుతున్న ఆదరణ!

పొదలకూరు, మేజర్ న్యూస్ :     మండలంలోని మర్రిపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీకి రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. ఇందులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పది కుటుంబాలు టీడీపీలో చేరాయి. స్థానిక టీడీపీ నాయకుల సమక్షంలో వారు పార్టీ కండువాలు కప్పుకుని టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా కొత్తగా పార్టీలో చేరిన వారు టీడీపీ విధానాలు, స్థానికంగా పార్టీ నాయకత్వం చేపడుతున్న కార్యక్రమాలపై ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో వరుసగా జరుగుతున్న చేరికలు టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపుతున్నాయి.మర్రిపల్లి గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త సమన్వయంతో ముందుకు సాగాలని నాయకులు పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో మరిన్ని కుటుంబాలు టీడీపీలో చేరే అవకాశం ఉందని పార్టీ నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రంలో రసమచంద్రయ్య గౌడ్,రాజగుంట. దశయ్య, చెమిడిబోయిన జనార్ధన్, పర్చూరు లక్ష్మయ్య, వెంపులూరు విజయ్ కుమార్ తదితరులు పార్టీలో చేరారు