BREAKING
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కళాకారుల ఐక్యతే మన బలం విద్యుత్ షాక్‌తో యమహా షోరూం మెకానిక్ మృతి! వాటర్ సర్వీసింగ్ చేస్తుండగా ప్రమాదం.. ఏఐటీఏ ఎన్నికల బరిలోకి సానియా మీర్జా, మహేశ్ భూపతి.. పోటీకి దూరంగా నిలిచిన లియాండర్ పేస్ నెల్లూరు రూరల్ టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా చెన్నారెడ్డి శ్రీనివాసులురెడ్డి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఆత్మకూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి ప్రజావాణిలో ఎంపీడీవో యాదగిరి కి వినతిపత్రం అందజేసిన మెట్టు శ్రీధర్ డబుల్ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో వివాదాస్పద నిర్ణయం.. అంపైర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన దేవదత్ పడిక్కల్ జడ్పిటిసి కి 12 నామినేషన్లు ఎంపీటీసీ కి 218 నామినేషన్లు ఉపసంహరణ జనసేనలో చేరిన వైసిపి యూత్ అధ్యక్షులు 25వ వార్డులో బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డి ఇంటింటా ప్రచారం హర్మన్‌ప్రీత్ శతక జోరు.. జింబాబ్వేపై ఘన విజయంతో సిరీస్ కైవసం చేసుకున్న భారత మహిళల జట్టు *కల్హేర్ మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎంపీ సురేష్ షట్కర్ ఎమ్మెల్యే డా. పట్లోళ్ల సంజీవరెడ్డి* *మర్డి గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎంపీ ఎమ్మెల్యే*

కూటమి ప్రచార హోరు ఎమ్మెల్యే సొంగాకు ఘన స్వాగతం

Select Suryaa Now
కూటమి ప్రచార హోరు  ఎమ్మెల్యే సొంగాకు ఘన స్వాగతం

జంగారెడ్డిగూడెం,మేజర్ న్యూస్ జంగా రెడ్డిగూడెంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సోమవారం కూటమి అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. వివిధ వార్డుల్లో ఇంటింటి ప్రచారం చేపట్టి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. కూటమి చైర్మన్ అభ్యర్థి రొంగల అనూషతో పాటు 9వ వార్డు టీడీపీ అభ్యర్థి సుంకర వెంకటలక్ష్మి, 10వ వార్డు అభ్యర్థి తెలగారపు లావణ్య, 11వ వార్డు అభ్యర్థి కూనం రాంబాబు ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజలు తమను గెలిపిస్తే అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని రొంగల అనూష తెలిపారు. చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ఏలూరు రోడ్డు బస్టాండ్ సమీపంలో ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తెలుగు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్, చైర్మన్ అభ్యర్థి రొంగల అనూష, 32 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళలు, అభిమానులు పాల్గొన్నారు.

 రిపోర్టర్ కెవి రమణ రావు జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా,