వేతనాలు చెల్లించాలని ఎం పి డివో కు వినతి
ఉదయగిరి,మేజర్ న్యూస్ : ఉదయగిరి మేజర్ పంచాయతీలో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు వేతనాలు చెల్లించాలని ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు గడ్డం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సోమవారం కార్మికులు ఎంపీడీవో సుకుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు గత ఏడు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ కష్టతరమైందన్నారు. గతంలో అధికారులకు విన్నవించగా నవంబరు 1వ తేదీలోపు వేతనాలు చెల్లించేలా చర్యలు చేపడతామన్నారే తప్ప ఇంతవరకు అతిగతి లేదన్నారు. ఈనెలాఖరులోపు తమకు వేతనాలు చెల్లించకపోతే 1వ తేదీ నుంచి విధులు బహిష్కరించి సమ్మెలోకి వెళతామన్నారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు.