BREAKING
ఈవీఎం గోదాముల్లో కలెక్టర్ తనిఖీ రాయదుర్గంలో వైఎస్సార్‌సీపీ ప్రచార జోరు 18వ వార్డు అభ్యర్థి కె. లోకేష్ రెడ్డిని గెలిపించాలని నేతల విజ్ఞప్తి న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కళాకారుల ఐక్యతే మన బలం విద్యుత్ షాక్‌తో యమహా షోరూం మెకానిక్ మృతి! వాటర్ సర్వీసింగ్ చేస్తుండగా ప్రమాదం.. ఏఐటీఏ ఎన్నికల బరిలోకి సానియా మీర్జా, మహేశ్ భూపతి.. పోటీకి దూరంగా నిలిచిన లియాండర్ పేస్ నెల్లూరు రూరల్ టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా చెన్నారెడ్డి శ్రీనివాసులురెడ్డి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఆత్మకూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి ప్రజావాణిలో ఎంపీడీవో యాదగిరి కి వినతిపత్రం అందజేసిన మెట్టు శ్రీధర్ డబుల్ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో వివాదాస్పద నిర్ణయం.. అంపైర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన దేవదత్ పడిక్కల్ జడ్పిటిసి కి 12 నామినేషన్లు ఎంపీటీసీ కి 218 నామినేషన్లు ఉపసంహరణ జనసేనలో చేరిన వైసిపి యూత్ అధ్యక్షులు 25వ వార్డులో బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డి ఇంటింటా ప్రచారం హర్మన్‌ప్రీత్ శతక జోరు.. జింబాబ్వేపై ఘన విజయంతో సిరీస్ కైవసం చేసుకున్న భారత మహిళల జట్టు

అల్లీపురం గ్రామంలో బాలల హక్కులు,పలు అంశాలపై విస్తృత అవగాహన కార్యక్రమం

Select Suryaa Now
అల్లీపురం గ్రామంలో బాలల హక్కులు,పలు అంశాలపై విస్తృత అవగాహన కార్యక్రమం

నెల్లూరు రూరల్ మేజర్ న్యూస్ :   జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్ .నాగ శైలజ  ఆదేశాలు,  మేరకు మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నెల్లూరు, అల్లిపురం గ్రామంలో నందు బాలల హక్కులు, బాలల రక్షణ, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, పోక్సో చట్టం, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, దత్తత, ఫోస్టర్ కేర్, ఆఫ్టర్ కేర్ తదితర అంశాలపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అలాగే అంగన్‌వాడీ కార్యకర్తలు, తల్లులు,  కిశోర బాలబాలికలకు బాలలకు సంబంధించిన హక్కులు, రక్షణ చర్యలు, అందుబాటులో ఉన్న ప్రభుత్వ సేవలు మరియు సహాయ వ్యవస్థలపై అవగాహన కల్పించారు. బాలలకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు చైల్డ్ హెల్ప్‌లైన్ 1098ను వినియోగించుకోవాలని సూచించారు.అలాగే బాల్య వివాహాలు, బాల కార్మికులు, పోక్సో కేసులు తదితర బాలల రక్షణ అంశాలపై తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. దత్తత ప్రక్రియ, ఫోస్టర్ కేర్, ఆఫ్టర్ కేర్ సేవల గురించి కూడా అవగాహన కల్పించారు. గ్రామస్థాయిలో బాలల రక్షణకు సంబంధించి ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో   సూపర్వైజర్లువి . శకుంతల, డి.సి.పి. యు నుండి.సోషల్ వర్కర్ పి . పావని కుమారి మరియు చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్ బి. దివ్య,సఖి వన్ స్టాప్ సెంటర్ కేసు వర్కర్ పి . శారద, అంగన్వాడీ కారకర్తలు పాల్గొన్నారు.