BREAKING
పూతలపట్టులో గౌతమ బుద్ధ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ తిరుమల, 2026 అక్టోబర్ 26 తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ కివీస్‌తో మూడో అనధికార టెస్టు బరిలోకి జస్‌ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్.. టీమిండియాకు భారీ ఊరట అక్రమ ఇసుక నిలువలు సీజ్ బిగ్ బాస్ హౌస్ ఎగ్జిట్ ఇంటర్వ్యూలో భావోద్వేగానికి గురైన షాలిని.. శివాజీ సంధించిన ప్రశ్నలకు కన్నీటి పర్యంతం 17వ డివిజన్‌లో అజేష్, భవాని విస్తృత ప్రచారం.. కమలం, గాజు గ్లాస్ గుర్తులకు ఓటేయాలని కూటమి నేతల విజ్ఞప్తి ఉద్యోగులకు రక్షణ కల్పించాలి -గత ఎన్నికల్లో సిబ్బందిపై దాడులు ఈసారి పునరావృతం కాకుండా చూడండి -డిఆర్ఓ కు ఏపీ జేఏసీ వినతి కూటమి అభ్యర్థికి మద్దతుగా ఇంటింటా ప్రచారం పద్మశాలి సంఘం మెదక్ యూత్ అధ్యక్షునిగా పోల నవీన్ కుమార్ నియామకం. పూతలపట్టులో గౌతమ బుద్ధ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ - హిమాలయ యోగి సనత్ సదానందగిరి మహారాజ్ తో కలిసి ఆవిష్కరణ - ఆశీర్వాదం, సన్మానం స్వీకరించిన ఎమ్మెల్యే సీతారాంపల్లిలో దొంగల బీభత్సం.. ఆర్నాబ్ తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలి అవనిగడ్డలో జోరుగా తెలుగుదేశం ప్రచారం ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసిన జయలక్ష్మి నైతిక విలువల పెంపునకు పరివర్తన్ 28న ముత్యాలమ్మ ఆలయ హుండీ లెక్కింపు.. ఆలయ ఓ వెంకటేశ్వర్లు

రాయదుర్గంలో వైఎస్సార్‌సీపీ ప్రచార జోరు 18వ వార్డు అభ్యర్థి కె. లోకేష్ రెడ్డిని గెలిపించాలని నేతల విజ్ఞప్తి

Select Suryaa Now
రాయదుర్గంలో వైఎస్సార్‌సీపీ ప్రచార జోరు  18వ వార్డు అభ్యర్థి కె. లోకేష్ రెడ్డిని గెలిపించాలని నేతల విజ్ఞప్తి

రాయదుర్గం టౌన్ మేజర్ న్యూస్ : రాయదుర్గం పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా రాయదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పోరాళ్ల శివకుమార్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మెట్టు విశ్వనాథ్ రెడ్డి, ఎస్‌ఈసీ సభ్యుడు గౌన్ ఉపేందర్ రెడ్డి, నవీన్ రెడ్డి తదితరులు ప్రచారంలో పాల్గొని ప్రజలను కలిశారు.

ఈ సందర్భంగా నాయకులు ప్రజలతో మమేకమవుతూ వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థులను, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను కోరారు. ఇంటింటికీ వెళ్లి గత ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ, ప్రస్తుత ప్రభుత్వ పాలనపై తమ అభిప్రాయాలను ప్రజల ముందు ఉంచారు.

రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మెట్టు విశ్వనాథ్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో జరుగుతున్న జాప్యాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలు, పట్టణ అభివృద్ధి వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

ముఖ్యంగా 18వ వార్డు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థి కె. లోకేష్ రెడ్డితో పాటు రాయదుర్గం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పోరాళ్ల శివకుమార్కు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని నాయకులు ఓటర్లను అభ్యర్థించారు. ప్రజల మద్దతుతో మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ ప్రచార కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు, రాయదుర్గం పట్టణ కమిటీ సభ్యులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.