BREAKING
ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరికరాలు ప్రారంభించిన కేటీఆర్ దోమడుగు శివారులో రోడ్డు ప్రమాదం ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా...? ఆదర్శవంతమైన డివిజన్ లక్ష్యంగా కృషి -53వ డివిజన్ ప్రచారంలో శంకర్ యాదవ్ ఎస్‌ఐఆర్ ప్రక్రియను పక్కాగా పూర్తి చేయాలి ... రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి "శనార్తి" షూటింగ్ ను సందర్శించిన సిపి ఎమ్మెల్యే సత్యం. నిజాయితీతోనే సమృద్ధి...అవినీతికి చరమగీతం పాడాలి నృసింహ క్షేత్రం నుంచి ధర్మ జాగృతి శంఖారావం! రంజీ ట్రోఫీలో చెలరేగిన ముంబై యువ ఆటగాళ్లు.. అంగక్రిష్ రఘువంశీ, ముషీర్ ఖాన్ శతకాల మోత రూ.4.82 కోట్లతో  డబుల్‌ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణరావు భవిత ఫిజియోథెరపిస్టులకు వేతనాలేవీ? వైసిపి ముఖ్య నాయకుడు చిగిచెర్ల రవి టిడిపిలోకి చేరిక… భోగి సినిమా కోసం డబ్బింగ్ పూర్తి చేసిన అనుపమ పరమేశ్వరన్.. శర్వానంద్ పీరియడ్ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలు ఓం మూవీలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా సాయిపల్లవి.. నిత్యారెడ్డి పాత్రతో అదరగొట్టనున్న టాలెంటెడ్ బ్యూటీ పోస్టర్‌పై పెద్ద ఫోటో ఉంటేనే సక్సెస్ అనుకోవడం చిన్న మనస్తత్వమే.. నటి రాధికా ఆప్టే బోల్డ్ కామెంట్స్

కూటమి అభ్యర్థికి మద్దతుగా ఇంటింటా ప్రచారం

Select Suryaa Now
కూటమి అభ్యర్థికి మద్దతుగా ఇంటింటా ప్రచారం

కలిదిండి /కైకలూరు, మేజర్ న్యూస్, కలిదిండి మండలం మట్టగుంట గ్రామంలో జనసేన, బీజేపీ పార్టీల మద్దతుతో తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తిరుమలశెట్టి ఈశ్వర పరశురాముడి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ కూటమి నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ అండ్రాజు శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. అర్హులైన పేద కుటుంబాలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, తల్లికి వందనం, దీపం పథకం, అన్నదాత సుఖీభవ వంటి సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, రహదారుల అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. మట్టగుంట గ్రామ సమగ్ర అభివృద్ధికి, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు తిరుమలశెట్టి ఈశ్వర పరశురాముడు కృషి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని పేర్కొంటూ, కూటమి అభ్యర్థికి మద్దతుగా నిలవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో డీసీ వైస్ చైర్మన్ నాగిడి వీరబ్రహ్మం, పీఏసీఎస్ అధ్యక్షులు బల్లా రాజు, కూటమి నాయకులు నల్లమోతు వెంకటేశ్వరరావు, కోపనాతి వెంకటేశ్వరరావు, కోకా తాతయ్య, దున్నా సత్యనారాయణ, గరికముక్కల అమ్మిరాజు, మందపాటి పెంటయ్య, తిరుమాని గోపాలకృష్ణ, కోపనాతి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

 రిపోర్టర్ రమేష్ కైకలూరు ఏలూరు జిల్లా,