17వ డివిజన్‌లో అజేష్, భవాని విస్తృత ప్రచారం.. కమలం, గాజు గ్లాస్ గుర్తులకు ఓటేయాలని కూటమి నేతల విజ్ఞప్తి
అనంతపురం ప్రతినిధి మేజర్ న్యూస్ :- అనంతపురం నగరంలోని 17వ డివిజన్‌లో కూటమి మేయర్ అభ్యర్థి అజేష్ యాదవ్ , కార్పొరేటర్ అభ్యర్థి పి. భవాని రవికుమార్‌కు మద్దతుగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డివిజన్‌లోని వివిధ ప్రాంతాల్లో కలియతిరుగుతూ ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ, కమలం గుర్తుకు, గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
కూటమి నాయకులు, కార్యకర్తలకు డివిజన్ ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. ప్రచారంలో భాగంగా స్థానిక సమస్యలను తెలుసుకుంటూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధికి కృషి చేసే నాయకత్వాన్ని ఆదరించాలని నేతలు కోరారు. మూడు పార్టీల నాయకులు సమన్వయంతో ప్రచారంలో పాల్గొనడం కూటమి శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. కార్యక్రమంలో టీడీపీ నాయకులు వర్ధన్, కార్తీక్, మేదర వెంకటేష్, అంగడి చలపతి, రామంజి, రఘు, పురుషోత్తం, మధు, నాగార్జున, సాయి, నవీన్, మంచాల చంద్ర, బీజేపీ నాయకులు చంద్ర, మల్లికార్జున, శివకుమార్, ఈశ్వర్ బాబు, ఆంజనేయ ప్రసాద్, సన్నా, ఆరిఫ్, రాము, హరి, భాస్కర్, గోవర్ధన్, చోటు, ధరాజ్ భాష, జగదీష్, మాధవ్, విజయ్, తిరుమల తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు నాయకురాలు గిరీష, అనసూయ, వీర మహిళలు, పలువురు కూటమి కార్యకర్తలు ప్రచారంలో పాల్గొని అభ్యర్థులకు మద్దతుగా ఓటర్లను అభ్యర్థించారు.
మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్..