పూతలపట్టులో గౌతమ బుద్ధ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ - హిమాలయ యోగి సనత్ సదానందగిరి మహారాజ్ తో కలిసి ఆవిష్కరణ - ఆశీర్వాదం, సన్మానం స్వీకరించిన ఎమ్మెల్యే
చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్:పూతలపట్టు నియోజకవర్గం పరిధిలోని శ్రీ వేము ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం జరిగిన శ్రీ గౌతమ బుద్ధ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పాల్గొన్నారు.ప్రముఖ హిమాలయ యోగి శ్రీశ్రీశ్రీ సనత్ సదానందగిరి మహారాజ్ గారితో కలిసి శ్రీ గౌతమ బుద్ధ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రముఖ హిమాలయ యోగి శ్రీశ్రీశ్రీ సనత్ సదానందగిరి మహారాజ్ గారి నుంచి ఆశీర్వాదం, సన్మానాన్ని అందుకున్నారు.కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్ కళాశాల అధినేత చంద్రశేఖర్ నాయుడు, నాయకులు పాల్గొన్నారు.
చిత్తూరు అర్బన్ రిపోర్టర్, లవకుమార్