ఈవీఎం గోదాముల్లో కలెక్టర్ తనిఖీ
సూర్య ప్రతినిధి, ఒంగోలు : మామిడిపాలెంలోని ఈవీఎం గోదాములను జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు సోమవారం తనిఖీ చేశారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా గోదాముల షట్టర్లకు వేసిన తాళాలు, సీల్స్‌ను పరిశీలించారు. గోదాముల నిర్వహణకు సంబంధించిన రిజిస్టర్లను తనిఖీ చేసి వివరాలను పరిశీలించారు. ఈవీఎం గోదాముల వద్ద కల్పిస్తున్న భద్రతా ఏర్పాట్లు, గోదాముల నిర్వహణ తీరును పరిశీలించిన కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తనిఖీలో జిల్లా ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ శ్రీనివాసరావుతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.