BREAKING
ఈవీఎం గోదాముల్లో కలెక్టర్ తనిఖీ రాయదుర్గంలో వైఎస్సార్‌సీపీ ప్రచార జోరు 18వ వార్డు అభ్యర్థి కె. లోకేష్ రెడ్డిని గెలిపించాలని నేతల విజ్ఞప్తి న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కళాకారుల ఐక్యతే మన బలం విద్యుత్ షాక్‌తో యమహా షోరూం మెకానిక్ మృతి! వాటర్ సర్వీసింగ్ చేస్తుండగా ప్రమాదం.. ఏఐటీఏ ఎన్నికల బరిలోకి సానియా మీర్జా, మహేశ్ భూపతి.. పోటీకి దూరంగా నిలిచిన లియాండర్ పేస్ నెల్లూరు రూరల్ టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా చెన్నారెడ్డి శ్రీనివాసులురెడ్డి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఆత్మకూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి ప్రజావాణిలో ఎంపీడీవో యాదగిరి కి వినతిపత్రం అందజేసిన మెట్టు శ్రీధర్ డబుల్ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో వివాదాస్పద నిర్ణయం.. అంపైర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన దేవదత్ పడిక్కల్ జడ్పిటిసి కి 12 నామినేషన్లు ఎంపీటీసీ కి 218 నామినేషన్లు ఉపసంహరణ జనసేనలో చేరిన వైసిపి యూత్ అధ్యక్షులు 25వ వార్డులో బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డి ఇంటింటా ప్రచారం హర్మన్‌ప్రీత్ శతక జోరు.. జింబాబ్వేపై ఘన విజయంతో సిరీస్ కైవసం చేసుకున్న భారత మహిళల జట్టు

స్థానిక ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదు - టీడీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి..

Select Suryaa Now
స్థానిక ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదు - టీడీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి..

పొదలకూరు,మేజర్ న్యూస్ :   స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం తప్పదని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. సోమవారం పొదలకూరు మండలంలోని మర్రిపల్లి గ్రామంలో టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి కలిచేటి ప్రభాకర్ రెడ్డి, బిరదవోలు ఎంపీటీసీ అభ్యర్థిణి అన్నలూరు సుమలతతో కలిసి ఆయన ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని వీధుల్లో పర్యటిస్తూ ప్రజలను ఆప్యాయంగా పలకరించి, టీడీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.అనంతరం ఎమ్మెల్యే సోమిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, గ్రామీణాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు. గత వైసీపీ పాలనలో గ్రామాల అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని విమర్శించారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా వైసీపీ నాయకులు రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు. వైసీపీ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.సర్వేపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని సోమిరెడ్డి స్పష్టం చేశారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, రహదారుల అభివృద్ధి, తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. గ్రామాల అభివృద్ధి మరింత వేగవంతం కావాలంటే స్థానిక సంస్థల్లోనూ టీడీపీ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం  ఉందన్నారు.
పొదలకూరు జడ్పీటీసీ అభ్యర్థి కలిచేటి ప్రభాకర్ రెడ్డి, బిరదవోలు ఎంపీటీసీ అభ్యర్థిణి అన్నలూరు సుమలతను భారీ మెజార్టీతో గెలిపించి టీడీపీ సత్తా చాటాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల విజయం ఖాయమని సోమిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.