BREAKING
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కళాకారుల ఐక్యతే మన బలం విద్యుత్ షాక్‌తో యమహా షోరూం మెకానిక్ మృతి! వాటర్ సర్వీసింగ్ చేస్తుండగా ప్రమాదం.. ఏఐటీఏ ఎన్నికల బరిలోకి సానియా మీర్జా, మహేశ్ భూపతి.. పోటీకి దూరంగా నిలిచిన లియాండర్ పేస్ నెల్లూరు రూరల్ టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా చెన్నారెడ్డి శ్రీనివాసులురెడ్డి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఆత్మకూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి ప్రజావాణిలో ఎంపీడీవో యాదగిరి కి వినతిపత్రం అందజేసిన మెట్టు శ్రీధర్ డబుల్ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో వివాదాస్పద నిర్ణయం.. అంపైర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన దేవదత్ పడిక్కల్ జడ్పిటిసి కి 12 నామినేషన్లు ఎంపీటీసీ కి 218 నామినేషన్లు ఉపసంహరణ జనసేనలో చేరిన వైసిపి యూత్ అధ్యక్షులు 25వ వార్డులో బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డి ఇంటింటా ప్రచారం హర్మన్‌ప్రీత్ శతక జోరు.. జింబాబ్వేపై ఘన విజయంతో సిరీస్ కైవసం చేసుకున్న భారత మహిళల జట్టు *కల్హేర్ మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎంపీ సురేష్ షట్కర్ ఎమ్మెల్యే డా. పట్లోళ్ల సంజీవరెడ్డి* *మర్డి గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎంపీ ఎమ్మెల్యే*

స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పని చేయాలి : ఎమ్మెల్యే ఏలూరి

Select Suryaa Now
స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పని చేయాలి : ఎమ్మెల్యే ఏలూరి

పర్చూరు, మేజర్‌న్యూస్‌ : 
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు అఖండ విజయం సాధించడమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పిలుపునిచ్చారు. సోమవారం ఎమ్మెల్యే ఏలూరి క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన ఆయన పలువురు అభ్యర్థులకు బీఫారాలను అందజేసి, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఏలూరి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. మరోవైపు వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌ దౌర్జన్యాలు, అక్రమాలు, దాడులనే రాజకీయ అస్త్రాలుగా మలుచుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అశాంతి సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు ఎన్నికల్లో ఓటమి భయంతోనే నామినేషన్ల అంశాన్ని వివాదాస్పదం చేస్తున్నారని ఏలూరి విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకోవడంతో పాటు బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా చేసేందుకు న్యాయపరమైన కేసులు వేస్తున్నారని ఆరోపించారు. 59 కేసుల ద్వారా ఎన్నికల ప్రక్రియకు ఆటంకాలు కలిగిస్తున్నారని పేర్కొన్నారు. పంచాయతీలకు రావాల్సిన రూ.12,600 కోట్ల నిధులను అడ్డుకోవడం గ్రామీణాభివృద్ధికి విఘాతం కలిగించడమేనని అన్నారు. పుంగనూరు, రాయచోటి, కడప, పులివెందుల ప్రాంతాల్లో వైకాపా శ్రేణుల తీరుపై ప్రజల్లో చర్చ జరుగుతోందని పేర్కొంటూ, రాజకీయాల్లో ప్రజాస్వామ్య విలువలు, సంయమనం పాటించాలని హితవు పలికారు. మేనకోడలి పెళ్లిని అడ్డుకోవడం అమానవీయం మేనమామ అంటే తండ్రి తర్వాత తండ్రితో సమానమని, అలాంటి బంధాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఏలూరి అన్నారు. మేనకోడలి వివాహానికి సంబంధించిన వ్యవహారంలో జగన్‌ వ్యవహరిస్తున్న తీరుపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఓ ఆడపిల్ల వివాహానికి అడ్డంకులు కలిగించడం అమానవీయమని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారం జగన్‌ రాజకీయ, మానవతా విలువలపై ప్రశ్నలు లేవనెత్తుతోందని అన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్వహించిన కార్యక్రమాలు, వేడుకల సమయంలో భద్రతా అంశాలను ఎలా పరిగణనలోకి తీసుకున్నారో ఇప్పుడు కూడా అదే ప్రమాణాలతో వ్యవహరించాలని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలను వివాదాలుగా మార్చడం సరికాదన్నారు. ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే చంద్రబాబు ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఏలూరి స్పష్టం చేశారు. గ్రామీణాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, స్థానిక సంస్థల బలోపేతానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. నాయకులు, కార్యకర్తలు వ్యక్తిగత విభేదాలకు తావివ్వకుండా ఐక్యంగా ముందుకు సాగాలని, ఇంటింటి ప్రచారాన్ని విస్తృతం చేసి ప్రజల మద్దతు కూడగట్టాలని పిలుపునిచ్చారు. సమష్టి కృషితో స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, పార్టీ శ్రేణులు, అభ్యర్థులు పాల్గొన్నారు.

సూర్య రిపోర్టర్‌ : షేక్‌ జానిభాష, ఇంకొల్లు.