*బాల వికాస్ నీటి శుద్ధి పై అవగాహన సదస్సు *
అల్లాదుర్గం; మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం లోని ముస్లాపూర్ గ్రామం లో సర్పంచ్ జ్యోతి -రమేష్ అధ్యక్షతన బాలవికాస నీటి శుద్ధి కారణ అవగాహనా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి బాలవికాస ప్రోగ్రామ్ మేనేజర్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతు గ్రామస్థులు అందరు శుద్ధి చేసిన నీరు తాగి ఆరోగ్యం గా ఉండాలి అని కోరినారు, ప్రజల భాగస్వామ్యం తో వాటర్ ప్లాంట్ నిర్వహించడం వలన, అందరు కలసి మెలసి ఉంటారు అంటూ సంస్థ 80 శాతం సహాయం చేస్తుంది. అని చెప్పారు అనంతరం వాటర్ ప్లాంట్ కమిటీ వేయడం జరిగింది, ఈ కార్యక్రమం లో బాలవికాస ప్రతినిధులు, ప్రసూన్ రెడ్డి, బాబు, ఉప సర్పంచ్ మంగలి రమేష్ పంచాయతీ సెక్రెటరీ నాగరాజ్ వార్డ్ మెంబర్లు మాజీ ప్రజాప్రతినిధులు, ముస్లాపూర్ గ్రామ బాల వికాస్ అధ్యక్షులుగా బుక్క జావిద్ ఉపాధ్యక్షులుగా కమలాకర్ కార్యదర్శిగా చంద్రయ్య ఉప కార్యదర్శిగా దుబ్బ మహిపాల్ కోశాధికారిగా కన్నయ్య గారి సరిత డైరెక్టర్లు గౌతపురం చంద్రకళ,కుక్కల భాగ్యం, తర్లపల్లి రాజ్ కుమార మారియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.