అయోధ్యలో శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం నిర్మాణానికి భూమి పూజ
అయోధ్యలో శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం నిర్మాణానికి భూమి పూజ
అయోధ్యలో రెండు ప్రదేశాల్లో భూమి పూజ నిర్వహించిన శ్రీ సుభుధేంద్రతీర్థులు
మంత్రాలయం, సూర్య ప్రతినిధి అయోధ్య లో శ్రీ రాఘవేంద్ర స్వామి మఠ పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్రతీర్థులు సోమవారం పవిత్ర అయోధ్య క్షేత్రాన్ని సందర్శించి, అక్కడ శ్రీ రాఘవేంద్ర స్వాముల మఠం నిర్మాణానికి రెండు ప్రదేశాల్లో భూమి పూజ నిర్వహించారు. అనంతరం అయోధ్యలోని బాలరాముని దర్శించుకుని, లోక కల్యాణం, ప్రజలందరి క్షేమం కోసం ప్రార్థించారు.
ఈ భూమి పూజ కార్యక్రమంలో రాజా అప్రమేయచార్య, శ్రీ కరణం ప్రకాష్, బెంగళూరుకు చెందిన శ్రీ సుబ్బనరసింహ, అయోధ్యలోని శ్రీ రామదేవర ఆలయ ప్రధాన అర్చకులు, శ్రీ మఠ భక్తులు, శిష్యులు పాల్గొన్నారు.
అయోధ్యలో శ్రీ రాఘవేంద్ర స్వామి మఠ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం శ్రీ మఠం చరిత్రలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలవనుంది. నిర్మాణాలు పూర్తయిన అనంతరం అయోధ్యను సందర్శించే శ్రీ రాఘవేంద్ర స్వామి భక్తులకు వసతి, ఇతర ఆధ్యాత్మిక సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నిర్మాణం ద్వారా శ్రీ మఠానికి, పవిత్ర అయోధ్య క్షేత్రానికి మధ్య ఆధ్యాత్మిక అనుబంధం మరింత బలోపేతం కానుంది అని శ్రీ మఠం పీరాధిపతులు ఆశాభావం వ్యక్తం చేశారు.
నల్లారెడ్డి సూర్య ప్రతినిధి మంత్రాలయం, కర్నూలు జిల్లా