BREAKING
ప్రజా ఆశీర్వాదంతో అభివృద్ధికి బాటలు వేస్తా! రోడ్డు ప్రమాదంలో దంపతులకు గాయాలు! సిరమ్మ కులంపై కోర్టులో వైసీపీ పిటిషన్.... *ఏకగ్రీవాన్నీ అడ్డుకున్న వైసీపీ* టీడీపీలో చేరిన వైసీపీ సీనియర్ నాయకుడు షేక్ చాంద్ బాషా భారత్ కివీస్ మూడో టి20 పోరు.. కీలక ఆటగాళ్లపై అజింక్య రహనే ఆసక్తికర వ్యాఖ్యలు పోలింగ్ అధికారులకు శిక్షణ రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలి.. తహసీల్దార్‌కు భారతీయ కిసాన్‌ సంఘ్‌ వినతి జ్యోతిష్యం లో డాక్టరేట్ సాధించిన ఆర్.సి.పురం వాసి జంగారెడ్డిగూడెం మున్సిపల్ వైస్ చైర్మన్ ఆర్యవైశ్యులకు దక్కేనా ? 11వ డివిజన్‌లో కొండ గీతికకు మద్దతుగా వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ప్రచారం నాగర్ కర్నూల్ జనరల్ ఆస్పత్రిలో ద్విచక్ర వాహనం చోరీ ఘటనపై కేసు నమోదు .. ఎస్ఐ వెంకటరెడ్డి పాకిస్తాన్ క్రికెట్ జట్టులో సంచలన మార్పు.. సైమ్ అయూబ్‌పై వేటు, సాహిబ్‌జాదా ఫర్హాన్‌కు చోటు అర్నాబ్ తుఫాన్ దృష్ట్యా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి హార్దిక్ పాండ్యాను కాదని సూర్యకుమార్ యాదవ్‌కు టి20 కెప్టెన్సీ.. అజిత్ అగార్కర్ తీసుకున్న సాహసోపేత నిర్ణయమే కారణమన్న మాజీ సెలెక్టర్ ఈనెల 28న ఐఎఫ్‌డబ్ల్యూజే వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు • సీనియర్ జర్నలిస్టులకు సన్మానం

కొమురం భీమ్ వర్ధంతిని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలి ఆదివాసీ సంఘాల నేతల డిమాండ్

Select Suryaa Now
కొమురం భీమ్ వర్ధంతిని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలి ఆదివాసీ సంఘాల నేతల డిమాండ్

కొమురం భీమ్ వర్ధంతిని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలి
ఆదివాసీ సంఘాల నేతల డిమాండ్

సూర్య, నిర్మల్ జిల్లా ప్రతినిధి

నిర్మల్: ఆదివాసీ హక్కుల కోసం నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన కొమురం భీమ్ వర్ధంతిని రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అధికారికంగా నిర్వహించాలని ఆదివాసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకే పరిమితం చేయడం సరికాదన్నారు.

నిర్మల్‌లో సోమవారం ఆదివాసీ నాయక పోడు సంఘం జిల్లా అధ్యక్షుడు సాకి లక్ష్మణ్ ఆధ్వర్యంలో కొమురం భీమ్ 86వ వర్ధంతిని నిర్వహించి నివాళులర్పించారు. ఆయన ఆశయాలను భావితరాలకు తెలియజేయాలని, ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవ పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు.

కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకగారి భూమయ్య, ముసలి చిన్నయ్య, సుంచు సవీన్, రామేష్, జంగిలి రాకేష్, మంద మల్లేష్, బోసని రాజేశ్వర్, తోడుసం గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.