BREAKING
కెనడా దిగుమతులపై అమెరికా టారిఫ్‌లు రెట్టింపు అయితే విధ్వంసకరమే ఫ్రాన్స్‌లో వివాదాస్పద బిల్లుపై తీవ్ర విమర్శలు ఆదర్శ కుటుంబం వేదికపై వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు.. సినిమా విజయంపై టాలీవుడ్ స్టార్ హీరో ఫుల్ కాన్ఫిడెంట్ కాంగోలో ఉగ్రవాదానికి అక్రమ బంగారపు నిధులు ఆదర్శ కుటుంబం వేదికపై ఊహించని పరిణామం.. హీరోయిన్ శ్రీనిధి శెట్టి కాళ్లు మొక్కిన త్రివిక్రమ్ శ్రీనివాస్ సెప్టెంబర్‌లో ఊపందుకున్న కోర్ క్యాపిటల్ గుడ్స్ ఆర్డర్లు మరియు షిప్‌మెంట్లు వార్షిక లాభాల అంచనాలను పెంచిన పానీయాల దిగ్గజం వరుసగా ఆరు ఫ్లాపులు పడినా చెక్కుచెదరని క్రేజ్.. చేతిలో ఏకంగా అరడజను సినిమాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ బ్యూటీ పునర్నిర్మాణ ఖర్చుల భారం తొలగిపోవడంతో భారీగా పెరిగిన లాభాలు మీమ్ వివాదం కారణంగా ఎండార్స్‌మెంట్ల నుంచి తొలగించిన చైనా బ్రాండ్లు ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ స్ట్రీమింగ్ వాణిజ్య ఆంక్షల నడుమ వ్యాపార నిర్వహణపై న్యాయ నిపుణుల విశ్లేషణ సెలబ్రిటీ ప్రకటనల నిబంధనను సమర్థించుకున్న ఫ్లోరిడా బార్.. మోర్గాన్ అండ్ మోర్గాన్ దావాపై స్పందన ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కావాలా.. రోజూ పాటించగల ఈ చిన్న చిన్న మార్పులతో మనశ్శాంతిని సొంతం చేసుకోండి అమెరికా కార్పొరేట్ రంగంలో యాంటీట్రస్ట్ గండం

రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలి.. తహసీల్దార్‌కు భారతీయ కిసాన్‌ సంఘ్‌ వినతి

Select Suryaa Now
రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి  24 గంటల నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలి..   తహసీల్దార్‌కు భారతీయ కిసాన్‌ సంఘ్‌ వినతి

కొండాపూర్‌;కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, వరంగల్‌ రైతు డిక్లరేషన్‌ను వెంటనే అమలు చేయాలని భారతీయ కిసాన్‌ సంఘ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడం బాధాకరమన్నారు.సోమవారం కొండాపూర్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట భారతీయ కిసాన్‌ సంఘ్‌ ఆధ్వర్యంలో తక్కువ వోల్టేజీ విద్యుత్‌ సమస్యతో పాటు రైతుల సమస్యలపై ఆందోళన నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌ అశోక్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో రోజుకు ఎనిమిది గంటల విద్యుత్‌  సక్రమంగా అందడం లేదని విమర్శించారు. రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు.పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి అన్ని పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)పై రూ.500 అదనంగా చెల్లించి కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారని, ప్రస్తుతం కొన్ని రకాల ధాన్యానికే పరిమితం చేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. భూమిలేని రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేల చొప్పున చెల్లిస్తామని ప్రకటించిన ప్రభుత్వం, మూడేళ్లకు సంబంధించిన రూ.36 వేల మొత్తాన్ని వెంటనే అందించాలని కోరారు.ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరువు పరిస్థితులను సమీక్షించి, పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు తగిన నష్టపరిహారం అందించాలని రామకృష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు. రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి, వరంగల్‌ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్‌ సంఘ్‌ మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు దయానంద్‌, మొగులయ్య, బుచ్చయ్య, లక్ష్మణ్‌గౌడ్‌, పాండురంగారెడ్డి, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.