BREAKING
ఎన్నికల విధులకు ప్రత్యేక రవాణా ఏర్పాట్లు 40వ వార్డులో కార్పొరేటర్ గుణశేఖర్ దూకుడు - గ్రూలింగ్స్ పేటలో ఇంటింటి ప్రచారం - మేయర్ గా కటారి హేమలతను గెలిపించండి అప్పులు తీర్చడానికి డబ్బులు ఇవ్వలేదని తల్లిని హతమార్చిన కొడుకు స్థానిక ఎన్నికల నేపథ్యంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ *నిరుపేద కుటుంబాలకు దాతలు అండగా నిలవాలి* తుఫాను నేపథ్యంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి-- జిల్లా వైద్య శాఖ అధికారి రవిబాబు తేనెబండలో సైకిల్ హోరు - ఇంటింటికీ ఓట్లు అభ్యర్థిస్తున్న కార్పొరేటర్ తేజశ్రీ పచ్చప్ప - మేయర్ గా హేమలతకు ఓటు వేయండి అబ్దుల్ కలాం ఎక్స్ అవార్డుతో శ్రీనివాసరావుకు సత్కారం సిపిఐ,సీపీఎం అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించడం దుర్మార్గం 14 మంది పంచాయతీ కార్యదర్శులకు ప్రొబేషన్ డిక్లరేషన్ ఆర్డర్ కాపీలు అందజేత 59వ డివిజన్‌లో వైసీపీ అభ్యర్థి కిషన్‌కు అడ్వకేట్ల మద్దతు అద్దంకిలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్. మాచవరం గ్యాస్ లీకేజ్ పై ప్రజలు ఆందోళన చెందవద్దు అంగరంగ వైభవంగా శ్రీవారి రథోత్సవం ఓటీటీలోకి జి.వి. ప్రకాశ్ కుమార్ కొత్త థ్రిల్లర్.. అక్టోబర్ 30 నుంచి సోనీ లివ్‌లో 'ఇమ్మోర్టల్' స్ట్రీమింగ్

ప్రజా ఆశీర్వాదంతో అభివృద్ధికి బాటలు వేస్తా!

Select Suryaa Now
ప్రజా ఆశీర్వాదంతో అభివృద్ధికి బాటలు వేస్తా!

భోగాపురం, సూర్య : తండ్రి కర్రోతు బంగార్రాజు అందించిన రాజకీయ అనుభవం, ప్రజలతో ఉన్న అనుబంధాన్ని వారసత్వంగా తీసుకుని భోగాపురం మండల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని జడ్పీటీసీ అభ్యర్థిని కర్రోతు చంద్రకళ పేర్కొన్నారు. తనను ఆశీర్వదించి జడ్పీటీసీగా అవకాశం కల్పించాలని ప్రజలను అభ్యర్థించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. మండలంలోని తూడెం, కౌలువాడ గ్రామాల్లో ఎంపీటీసీ అభ్యర్థిని కుంచం శాంతకుమారితో కలిసి చంద్రకళ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మార్క్‌ఫెడ్‌ చైర్మన్, తెదేపా మండల ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు కూడా పాల్గొన్నారు. గ్రామాల్లో ప్రజలను, పార్టీ శ్రేణులను కలుసుకుంటూ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం సాగించారు. ప్రజల సమస్యలు, గ్రామాల అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ ఓటర్లతో మమేకమయ్యారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు తెలిపి విజయాన్ని అందించాలని నాయకులు కోరారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతామని పేర్కొన్నారు. తండ్రి రాజకీయ అనుభవం, ప్రజలతో ఉన్న సంబంధాలు తనకు మార్గదర్శకంగా నిలుస్తాయని చంద్రకళ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ దంతులూరి సూర్యనారాయణ రాజు, తెదేపా పార్లమెంట్ అధికార ప్రతినిధి నీలాపు అప్పలరామిరెడ్డి, క్లస్టర్‌ కో-కన్వీనర్‌ కోరాడ తాతారావు, మండల రైతు అధ్యక్షుడు రీసు రమణ, మాజీ సర్పంచి సూరి అప్పారావు, ఏఎంసీ డైరెక్టర్‌ గరి వెంకటరమణ, మాజీ ఎంపీటీసీ వెంకటసత్యం, బాలు, స్థానిక తెదేపా నాయకులు, కార్యకర్తలు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : వై శ్రీనివాస రావు, భోగాపురం, విజయనగరం జిల్లా.