తేనెబండలో సైకిల్ హోరు - ఇంటింటికీ ఓట్లు అభ్యర్థిస్తున్న కార్పొరేటర్ తేజశ్రీ పచ్చప్ప - మేయర్ గా హేమలతకు ఓటు వేయండి
చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్:
చిత్తూరు నగరం 28వ వార్డు తేనెబండలో కార్పొరేటర్ తేజశ్రీ పచ్చప్ప ఇంటింటి ప్రచారం జోరుగా సాగుతోంది. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఆదేశాల మేరకు తేనెబండలో పర్యటించిన తేజశ్రీ పచ్చప్ప, గత రెండున్నరేళ్లలో తేనెబండలో జరిగిన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టులు, మంచినీటి సదుపాయాల వంటి అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఆధ్వర్యంలో నగరం అభివృద్ధి బాటలో పయనిస్తోందని, మేయర్ గా కటారి హేమలత గెలిస్తే అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని చెబుతూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. తేనెబండ ప్రజలు తమకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో తెదేపా ప్రధాన కార్యదర్శి పచ్చప్పతో పాటు, 28వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు అశోక్, రాజు, మూర్తి ,వార్డు నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
చిత్తూరు అర్బన్ రిపోర్టర్ లవ కుమార్