BREAKING
ఫ్రాన్స్‌లో వివాదాస్పద బిల్లుపై తీవ్ర విమర్శలు ఆదర్శ కుటుంబం వేదికపై వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు.. సినిమా విజయంపై టాలీవుడ్ స్టార్ హీరో ఫుల్ కాన్ఫిడెంట్ కాంగోలో ఉగ్రవాదానికి అక్రమ బంగారపు నిధులు ఆదర్శ కుటుంబం వేదికపై ఊహించని పరిణామం.. హీరోయిన్ శ్రీనిధి శెట్టి కాళ్లు మొక్కిన త్రివిక్రమ్ శ్రీనివాస్ సెప్టెంబర్‌లో ఊపందుకున్న కోర్ క్యాపిటల్ గుడ్స్ ఆర్డర్లు మరియు షిప్‌మెంట్లు వార్షిక లాభాల అంచనాలను పెంచిన పానీయాల దిగ్గజం వరుసగా ఆరు ఫ్లాపులు పడినా చెక్కుచెదరని క్రేజ్.. చేతిలో ఏకంగా అరడజను సినిమాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ బ్యూటీ పునర్నిర్మాణ ఖర్చుల భారం తొలగిపోవడంతో భారీగా పెరిగిన లాభాలు మీమ్ వివాదం కారణంగా ఎండార్స్‌మెంట్ల నుంచి తొలగించిన చైనా బ్రాండ్లు ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ స్ట్రీమింగ్ వాణిజ్య ఆంక్షల నడుమ వ్యాపార నిర్వహణపై న్యాయ నిపుణుల విశ్లేషణ సెలబ్రిటీ ప్రకటనల నిబంధనను సమర్థించుకున్న ఫ్లోరిడా బార్.. మోర్గాన్ అండ్ మోర్గాన్ దావాపై స్పందన ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కావాలా.. రోజూ పాటించగల ఈ చిన్న చిన్న మార్పులతో మనశ్శాంతిని సొంతం చేసుకోండి అమెరికా కార్పొరేట్ రంగంలో యాంటీట్రస్ట్ గండం 35 వ డివిజన్ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తా.... పాలడుగు విజయ

మాచవరం గ్యాస్ లీకేజ్ పై ప్రజలు ఆందోళన చెందవద్దు

Select Suryaa Now
మాచవరం గ్యాస్ లీకేజ్ పై ప్రజలు ఆందోళన చెందవద్దు

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంఅంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మాచవరం గ్రామంలో చోటుచేసుకున్న గ్యాస్ లీకేజీ ఘటనపై జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ సోమవారం స్పందించి అదికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.మాచవరం గ్రామం కళ్ల తూము దగ్గర భారత్ గ్యాస్ సిలిండర్ కంపెనీ సమీపంలో ఓఎన్జీసీ క్రూడ్ ఆయిల్ ప్రధాన పైప్ లైన్ లీక్ అయినట్లు అధికారులు గుర్తించారు. ఈ పైప్ లైన్ మామిడికుదురు ఓఎన్జీసీ నుండి పి.గన్నవరం మీదుగా మాచవరం, ముక్కామల - మడుపల్లి మీదుగా కాకినాడ వరకు వెళుతుందని తెలిపారు.లీకేజీ సమాచారం అందిన వెంటనే ఓఎన్జీసీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని లీకేజీని పూర్తిగా అదుపులోకి తీసుకున్నారని, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా కొత్తపేట ఆర్డీఓ జి.వి.వి. సత్యనారాయణ మాట్లాడుతూ.. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం వెంటనే అప్రమత్తమైందన్నారు. సంఘటనా స్థలంలో చేరుకుని  అగ్నిమాపక సిబ్బంది, రెవెన్యూ, సంబంధిత శాఖల అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఎలాంటి అపాయం జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా ఫైర్ ఇంజన్లను అందుబాటులో ఉంచామన్నారు.ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రమాద తీవ్రత తక్కువగానే ఉందని పేర్కొన్నారు. గ్రామ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, అధికారుల సూచనలు పాటిస్తూ సహకరించాలని కలెక్టర్ తరపున ఆర్డీఓ విజ్ఞప్తి చేశారు. అంబాజీపేట ఎంఆర్ఓ బి. చినబాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఓఎన్జీసీ అధికారులతో మాట్లాడి పలు జాగ్రత్తలు, సూచనలు చేశారు.

Abj.1 మాచవరం ఆయిల్ పైప్ లైన్ వద్ద ఓ ఎన్ జిసి ,రెవెన్యూ అధికారులు