BREAKING
డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా -రాయల్ వారి వీధి ప్రచారంలో బోయళ్ళ శాంతి అర్హులైన పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ బ్రాహ్మణపల్లి, కామేపల్లి గ్రామాల్లో గడపగడప ప్రచారంలో జడ్పీటీసీ సభ్యురాలు డాక్టర్ వునం దీపిక పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ గురజాల మండలంలోని బ్రాహ్మణపల్లి, కామేపల్లి గ్రామాల్లో* జరిగిన గడపగడప ప్రచార కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు డాక్టర్ వునం దీపికపాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి తిరుగుత చీరాల బీచ్‌లు తాత్కాలికంగా మూసివేత అవినీతి రహిత సింగరేణి మన లక్ష్యం.. ఎస్వో టు జిఎం డి.వి రామారావు అలయాస్ రుక్మిణి చిత్రం నుంచి రుక్కు రుక్కు రుక్మిణి సాంగ్ ప్రోమో విడుదల.. ఆకట్టుకుంటున్న నితిన్ మాస్ బీట్స్ బుచ్చి10,14 వార్డుల్లో చెప్పాం- చేస్తున్నాం కార్యక్రమం లో ఎమ్మెల్యే 69వ డివిజన్లో SDPI దూకుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల ఉచిత నమోదు కార్యక్రమం పట్టణ మరియు స్థానిక స్వపరిపాలన సంస్థల ఎన్నికలు-2026 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సమక్షంలో వైకాపా నుండి తెదేపాల చేరిక ఘట్టమనేని వారసుడి తదుపరి చిత్రం.. సంచలన విజయాల దర్శకుడితో జయకృష్ణ కొత్త సినిమా వెంకటేశ్ త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ పేద విద్యార్థినికి అండగా ఉండి లయన్స్ క్లబ్

స్థానిక ఎన్నికల నేపథ్యంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్

Select Suryaa Now
స్థానిక ఎన్నికల నేపథ్యంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్

సైదాపురం మండలం మేజర్ న్యూస్  :   రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో సైదాపురం మండలంలోని సైదాపురం, రామసాగరం, తూర్పుపూండ్ల గ్రామాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాపూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మాకినేని శ్రీనివాసరావు, రాపూరు, కలువాయి పోలీస్ స్టేషన్ల ఎస్‌ఐలు, సైదాపురం ఎస్‌ఐ వి. నాగమల్లేశ్వరరావు, సర్కిల్ పరిధిలోని పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి భయం, ఒత్తిడి, ప్రలోభాలకు లోనుకాకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకునేలా భరోసా కల్పించడమే ఫ్లాగ్ మార్చ్ ప్రధాన ఉద్దేశమని పోలీసులు తెలిపారు. ఎన్నికల సమయంలో గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా,  శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ఎన్నికల నియమావళిని పాటిస్తూ పోలీసులకు సహకరించాలని, పుకార్లను నమ్మవద్దని సూచించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే సంఘటనలు లేదా అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజల సహకారంతో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ కట్టుబడి ఉందని అధికారులు స్పష్టం చేశారు.