తుఫాను నేపథ్యంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి-- జిల్లా వైద్య శాఖ అధికారి రవిబాబు
నరసాపురం, మేజర్ న్యూస్:అర్నాబ్' తుఫాను నేపథ్యంలో, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తగా వైద్య పరంగా అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. ఏం. రవిబాబు, సంబంధిత వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆదేశించారు. సోమవారం మండలంలోని తూర్పుతాళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పి.ఎమ్. లంక గ్రామాల్లో ఉన్న తుఫాను పునరావాస కేంద్రాలను పరిశీలించారు. ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా వైద్య బృందాలకు, సిబ్బందికి పలు సూచనలు, చేశారు.
వైద్య అధికారులు, సిబ్బంది 24x7 వైద్య సేవల ఏర్పాటు చేయాలన్నారు:
తుఫాను ప్రభావం తగ్గే వరకు పి.ఎమ్. లంక,సమీప పునరావాస కేంద్రాలలో వైద్య బృందాలు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజలకు వైద్య సేవలు అందించాలి అన్నారు. సిబ్బంది ఎవరూ హెడ్‌క్వార్టర్స్ వదలి వెళ్లకూడదు అన్నారు.
పునరావాస కేంద్రాలలో ప్రథమ చికిత్స కిట్లు , పాముకాటు విష నిరోధక మందులు, ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లు, క్లోరిన్ బిళ్లలు ప్రాణరక్షణ మందులను తగినంత నిల్వ ఉంచాలి అన్నారు.
ప్రసవ తేదీ సమీపంలో ఉన్న గర్భిణులను ముందుగా సురక్షిత ప్రాంతాలకు లేదా సమీప ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించాలి అన్నారు. బాలింతలు, చిన్న పిల్లలు, వయోవృద్ధులకు అవసరమైన ప్రత్యేక వైద్య పర్యవేక్షణ అందించాలి సూచించారు.
భారీ వర్షాలు, వరదలు , వల్ల నీరు కలుషితం కాకుండా క్లోరినేషన్ చేపట్టాలి, అంటువ్యాధులు వ్యాపించకుండా పునరావాస కేంద్రాల పరిసర ప్రాంతాలలో పారిశుధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అంబులెన్స్ సర్వీసులు:
తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్న రోగులను తక్షణమే పెద్ద ఆసుపత్రులకు తరలించడానికి 108 అంబులెన్స్ వాహనాలను వ్యూహాత్మక ప్రాంతాలలో సిద్ధంగా ఉంచాలన్నారు.
రెవెన్యూ, పంచాయతీరాజ్, విపత్తు నిర్వహణ శాఖలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ జిల్లా ప్రజలకు ఎటువంటి వైద్య అత్యవసర పరిస్థితి తలెత్తకుండా వైద్య అధికారులు, సిబ్బంది, అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు.
తుఫాను పట్ల ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని, జిల్లా యంత్రాంగం వైద్య ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
రిపోర్టర్ ఇజ్రాయిల్ నరసాపురం పశ్చిమగోదావరి జిల్లా