అప్పులు తీర్చడానికి డబ్బులు ఇవ్వలేదని తల్లిని హతమార్చిన కొడుకు
ఏలూరు, మేజర్ న్యూస్: ఏలూరు శాంతినగర్‌లో దారుణం చోటుచేసుకుంది అప్పులు తీర్చడానికి డబ్బులు ఇవ్వలేదని, తన సంపాదనంతా సోదరికి ఇస్తుందనే అక్కసుతో పాచిపనులు చేసుకునే తల్లి సత్యవతిని కొడుకు సురేష్ టవల్‌తో ఉరిబిగించి హతమార్చాడు. ఆమె పనికి రాకపోవడంతో తోటి కార్మికుడు వెళ్లి చూడగా హత్య ఉదంతం వెలుగుచూసింది. ఏలూరు త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు, ఎస్సై రాంబాబు లు సోమవారం రాత్రి నిందితుడు సురేష్ ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.