అబ్దుల్ కలాం ఎక్స్ అవార్డుతో శ్రీనివాసరావుకు సత్కారం
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంకడియం మండలం వేమగిరి గ్రామానికి చెందిన టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి, టీడీపీ జోన్-2 కోఆర్డినేటర్ చెల్లుబోయిన శ్రీనివాసరావుకు డా. ఏపీజే అబ్దుల్ కలాం ఎక్సలెన్సీ అవార్డు లభించింది. హైదరాబాద్‌లోని చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో ఆదివారం యువ ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన అబ్దుల్ కలాం జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు.
వివిధ రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న ప్రముఖులు, విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నవారు, సంఘసేవకులను గుర్తించి ఈ అవార్డులను అందజేశారు. కార్యక్రమానికి హర్యానా మాజీ గవర్నర్, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, మాజీ కేంద్ర మంత్రి డా. సముద్రాల వేణుగోపాల చారి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమానికి జేఏసీ ఎంప్లాయీస్ అసోసియేషన్స్ ఏపీ రాష్ట్ర ఛైర్మన్ కేతా శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా చెల్లుబోయిన శ్రీనివాసరావు మాట్లాడుతూ, అబ్దుల్ కలాం నిజాయితీ, నిరాడంబరత, దేశసేవకు ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన జీవితం నేటి యువతకు, ప్రజాప్రతినిధులకు స్ఫూర్తిదాయకమని అన్నారు. వివిధ రంగాల్లో ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహిస్తున్న యువ ఆర్ట్స్ థియేటర్స్ అధినేత డా. బి.ఆర్. వెంకటరమణ సేవలను ప్రశంసించారు.
శ్రీనివాసరావుకు ఈ అవార్డు లభించడంపై పలువురు రాజకీయ నాయకులు, అభిమానులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు.