BREAKING
7వ వార్డులో '' ఇంటింటికి ..... టీడీపీ''...! డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా -రాయల్ వారి వీధి ప్రచారంలో బోయళ్ళ శాంతి అర్హులైన పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ బ్రాహ్మణపల్లి, కామేపల్లి గ్రామాల్లో గడపగడప ప్రచారంలో జడ్పీటీసీ సభ్యురాలు డాక్టర్ వునం దీపిక పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ గురజాల మండలంలోని బ్రాహ్మణపల్లి, కామేపల్లి గ్రామాల్లో* జరిగిన గడపగడప ప్రచార కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు డాక్టర్ వునం దీపికపాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి తిరుగుత చీరాల బీచ్‌లు తాత్కాలికంగా మూసివేత అవినీతి రహిత సింగరేణి మన లక్ష్యం.. ఎస్వో టు జిఎం డి.వి రామారావు అలయాస్ రుక్మిణి చిత్రం నుంచి రుక్కు రుక్కు రుక్మిణి సాంగ్ ప్రోమో విడుదల.. ఆకట్టుకుంటున్న నితిన్ మాస్ బీట్స్ బుచ్చి10,14 వార్డుల్లో చెప్పాం- చేస్తున్నాం కార్యక్రమం లో ఎమ్మెల్యే 69వ డివిజన్లో SDPI దూకుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల ఉచిత నమోదు కార్యక్రమం పట్టణ మరియు స్థానిక స్వపరిపాలన సంస్థల ఎన్నికలు-2026 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సమక్షంలో వైకాపా నుండి తెదేపాల చేరిక ఘట్టమనేని వారసుడి తదుపరి చిత్రం.. సంచలన విజయాల దర్శకుడితో జయకృష్ణ కొత్త సినిమా వెంకటేశ్ త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్

అంగరంగ వైభవంగా శ్రీవారి రథోత్సవం

Select Suryaa Now
అంగరంగ వైభవంగా శ్రీవారి రథోత్సవం

ద్వారకాతిరుమల మేజర్ న్యూస్: ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అశ్వయుజ మాస తిరు కళ్యాణ మహోత్సవాలు సందర్భంగా సోమవారం రాత్రి శ్రీవారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా స్వామి వారి రథాన్ని రకరకాల పుష్పమాలికలతో, అరటి బోధలతో, విద్యుత్ దీపాలతో, అలంకరించారు. శ్రీ స్వామివారిని అమ్మవార్లను ప్రత్యేక వాహనంపై  ఆలయం నుంచి  రథం వద్దకు తెచ్చారు. ఆలయ కార్య నిర్వహణ అధికారి వేండ్ర త్రినాధరావు, ఆలయ ధర్మకర్తల మండలి అనువంశిక ధర్మకర్త ఎస్వీఎస్. నివృత రావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, ప్రత్యేక పూజలు అనంతరం రథోత్సవం ప్రారంభమైంది. శ్రీదేవి, భూదేవి, సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు, భక్తులను కటాక్షిస్తూ తిరువీధుల్లో విహరించారు. స్వామివారు రథంపై విహరిస్తుండగా భక్తుల అడుగడుగున హారతులు సమర్పిస్తూ గోవిందా గోవిందా అంటూ భక్తి పారవస్యంతో మునిగిపోయారు. వందలాది మంది భక్తులు స్వామివారి రథాన్ని భక్తిశ్రద్ధలతో లాగుతూ స్వామివారి అనుగ్రహాన్ని పొందారు.  ఆద్యంతం శ్రీ స్వామివారి రథోత్సవం మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, చిత్ర విచిత్ర వేషాలు, వేదమంత్రాలు, బాణాసంచా నడుమ,  శాస్త్రోక్తంగా జరిగింది.