BREAKING
7వ వార్డులో '' ఇంటింటికి ..... టీడీపీ''...! డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా -రాయల్ వారి వీధి ప్రచారంలో బోయళ్ళ శాంతి అర్హులైన పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ బ్రాహ్మణపల్లి, కామేపల్లి గ్రామాల్లో గడపగడప ప్రచారంలో జడ్పీటీసీ సభ్యురాలు డాక్టర్ వునం దీపిక పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ గురజాల మండలంలోని బ్రాహ్మణపల్లి, కామేపల్లి గ్రామాల్లో* జరిగిన గడపగడప ప్రచార కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు డాక్టర్ వునం దీపికపాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి తిరుగుత చీరాల బీచ్‌లు తాత్కాలికంగా మూసివేత అవినీతి రహిత సింగరేణి మన లక్ష్యం.. ఎస్వో టు జిఎం డి.వి రామారావు అలయాస్ రుక్మిణి చిత్రం నుంచి రుక్కు రుక్కు రుక్మిణి సాంగ్ ప్రోమో విడుదల.. ఆకట్టుకుంటున్న నితిన్ మాస్ బీట్స్ బుచ్చి10,14 వార్డుల్లో చెప్పాం- చేస్తున్నాం కార్యక్రమం లో ఎమ్మెల్యే 69వ డివిజన్లో SDPI దూకుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల ఉచిత నమోదు కార్యక్రమం పట్టణ మరియు స్థానిక స్వపరిపాలన సంస్థల ఎన్నికలు-2026 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సమక్షంలో వైకాపా నుండి తెదేపాల చేరిక ఘట్టమనేని వారసుడి తదుపరి చిత్రం.. సంచలన విజయాల దర్శకుడితో జయకృష్ణ కొత్త సినిమా వెంకటేశ్ త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్

సిపిఐ,సీపీఎం అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించడం దుర్మార్గం

Select Suryaa Now
సిపిఐ,సీపీఎం అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించడం దుర్మార్గం

నెల్లూరు రూరల్ మేజర్ న్యూస్ :  నెల్లూరు రూరల్ మండలంలోని ములుమూడి ఎంపీటీసీ స్థానానికి సీపీఎం నుండి అట్లా అనిల్ కుమార్, అట్లా అంజయ్య, సిపిఐ నుండి కొర్రా రఫీ నామినేషన్ లను తిరస్కరించగా, అప్పీలు అధికారి ( ఆర్డీవో ) వద్ద విచారణకు అభ్యర్థులు హాజరయ్యారు. ముగ్గురి నామినేషన్ దరఖాస్తులు ఎన్నికల నిబంధనల ప్రకారం పూర్తి చేసినప్పటికీ, ఆర్ఓ తిరస్కరించారు. వెంటనే అభ్యర్థులు, ఆర్డీవో  దగ్గర అప్పీలు చేయడం జరిగింది. అప్పీలు అధికారి వద్ద సోమవారం నాడు విచారణ జరుతుందని చెప్పగా, అభ్యర్థులు వెళ్ళారు. అప్పీలు అధికారి అయిన నెల్లూరు ఆర్డీవో, ఎలాంటి విచారణ జరపకుండానే, ఆఫీస్ కు హాజరు కాకుండానే, విచారణ చేసినట్లు , నామినేషన్లు తిరస్కరిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఎన్నికల అధికారులు పారదర్శకంగా వ్యవహరించలేదు. అప్పీలు అధికారి తీరును భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు), నెల్లూరు రూరల్ మండల కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఈఘటనపై జిల్లా ఎన్నికల అధికారులు విచారణ జరిపి, వామపక్ష అభ్యర్థుల నామినేషన్లు ఆమోదించాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో  సిపిఎం జిల్లా కమిటి సభ్యులు ఆలూరు తిరుపాలు మండల కార్యదర్శి పి జనార్ధన్ తదితరులు పాల్గొనడం జరిగింది.