40వ వార్డులో కార్పొరేటర్ గుణశేఖర్ దూకుడు - గ్రూలింగ్స్ పేటలో ఇంటింటి ప్రచారం - మేయర్ గా కటారి హేమలతను గెలిపించండి
చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్:
చిత్తూరు నగరంలోని 40వ వార్డు గ్రూలింగ్స్ పేటలో కార్పొరేటర్ గుణశేఖర్ సోమవారం ఇంటింటికీ తిరిగి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఆదేశాల మేరకు మేయర్ అభ్యర్థి కటారి హేమలత గెలుపు కోసం ఆయన ప్రచారం సాగిస్తున్నారు. 40వ వార్డులో జరిగిన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సదుపాయాల వంటి అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. మేయర్ గా కటారి హేమలతను భారీ మెజారిటీతో గెలిపిస్తే నగర అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్యే నాయకత్వంలోనే అభివృద్ధి సాధ్యమని, కూటమి అభ్యర్థులను గెలిపించాలని గ్రూలింగ్స్ పేట ప్రజలను కోరారు. గత రెండున్నరేళ్లలో చిత్తూరు నగరం అభివృద్ధి బాటలో పయనిస్తోందని, రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు.
ప్రచారంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. వార్డు సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.
ఈ ప్రచారంలో కుమార్, రాజేష్, శరవణ, సురేందర్, తెదేపా కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వార్డులో గుణశేఖర్ ప్రచారానికి మహిళల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
చిత్తూరు అర్బన్ రిపోర్టర్ లవ కుమార్