టీడీపీలో చేరిన వైసీపీ సీనియర్ నాయకుడు షేక్ చాంద్ బాషా
నెల్లూరు, మేజర్ న్యూస్ : హరినాథపురం 25వ డివిజన్ పరిధిలోని కేఎస్ఆర్ నగర్ ఎక్స్‌టెన్షన్‌కు చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు షేక్ చాంద్ బాషా తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈరోజు సాయంత్రం టీడీపీ కూటమి కార్పొరేటర్ అభ్యర్థి దాట్ల చక్రవర్తన్ రెడ్డి, వార్డు అధ్యక్షుడు పెనాక శ్రీనివాసులు రెడ్డి, స్థానిక నాయకుల సమక్షంలో ఆయన వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా దాట్ల చక్రవర్తన్ రెడ్డి పార్టీ కండువా కప్పి షేక్ చాంద్ బాషాను తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ 25వ డివిజన్ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ చేరికతో డివిజన్‌లో టీడీపీ కూటమికి మరింత బలం చేకూరిందని స్థానిక నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.